1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపీచంద్ సినిమాలో విజయశాంతి?

IndiaGlitz [Tuesday, December 17, 2013]
Comments

గోపీచంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించనుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాలలో.  అదే గనుక నిజమైతే. 2004లో విడుదలైన 'ఇందిరమ్మ' తరువాత నటనకు దాదాపుగా దూరమై రాజకీయాలతో బిజీగా ఉన్న విజయశాంతి. పదేళ్ల గ్యాప్ తరువాత నటించే సినిమా ఇదే అవుతుంది. పేరు నిర్ణయించని సదరు గోపీచంద్ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర నిడివి చాలా చిన్నదైనప్పటికీ. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యంతో పాటు గోపీచంద్ కుటుంబంతోనూ. దర్శకుడు బి.గోపాల్ తోనూ ఉన్న అనుబంధం దృష్ట్యా విజయశాంతి ఆ పాత్రను చేయనుందని తెలుస్తోంది. విజయశాంతి నట జీవితాన్ని మలుపు తిప్పిన 'నేటి భారతం, ప్రతిఘటన' వంటి చిత్రాలకు గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకుడు కావడం.

'లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్' వంటి కమర్షియల్ విజయాలను బి.గోపాల్ తనకందించి ఉండడం వంటి అంశాలతో విజయశాంతి ఈ సినిమాకి అంగీకారం తెలిపిందట.   పోలీస్ అధికారిణిగా కానీ. రాజకీయ నాయకురాలిగా కానీ విజయశాంతి పాత్ర ఉండే అవకాశముందట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
అనామిక వచ్చే ఏడాదిలోనే

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'అనామిక' వచ్చే ఏడాదిలోనే..
 'హార్ట్ ఎటాక్'తో పాటు..
 'ఏమో గుర్రం ఏగరావచ్చు' సెన్సార్..
 Srikanth Attends His Friend's Son's Marriage
 Felt As If I Was Directing Chiranjeevi: YVS Chowdary
 Happy Birthday To Sesh Adivi
 Weekend Love Finishes Talkie Part
 Rey Movie Teaser review
 RGVs New Movie With Dr Raja Sekhar
 I Am A Living Example That miracles do happen: Rajinikanth
 Uyyala Jampala Audio Launched
 ప్రేమించాలి పాటలు విడుదల
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.