1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాని సందడే సందడి

IndiaGlitz [Wednesday, December 18, 2013]
Comments

ఈ ఏడాదిలో తను కథానాయకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమాతో పలకరించకపోయినా.. వచ్చే ఏడాదిలో మాత్రం హీరో నాని బాగానే సందడి చేయబోతున్నాడు.  అది కూడా  తక్కువ గ్యాప్ లో మూడు సినిమాలతో ఈ యువ కథానాయకుడు తన అభిమానుల ముందుకు రానున్నాడు .  చాలా రోజులుగా విడుదలకు నోచుకోని 'పైసా' చిత్రం జనవరి ద్వితీయార్థంలో విడుదలకు సిద్ధమయ్యే దిశగా సన్నాహాలు జరుపుకుంటుంటే..

'జెండా పై కపిరాజు' జనవరి 31న (ప్రస్తుతానికి) ముహుర్తం కుదుర్చుకుంది. ఇక హిందీలో ఘనవిజయం సాధించిన 'బాండ్ బాజా బారాత్'కి రీమేక్ గా తమిళంలో 'ఆహా కళ్యాణం' పేరుతో రూపొందిన చిత్రం తెలుగులోనూ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం.

ఇలా.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 'పైసా' విడుదలయిన వారానికి 'జెండాపై కపిరాజు'.. ఆ సినిమా విడుదలైన వారం రోజులకు 'ఆహా కళ్యాణం'.. ఇలా వారానికో సినిమా చొప్పున 3 చిత్రాలతో  నాని సందడే సందడి చేసేస్తాడన్నమాట. అలా గనుక జరిగితే ఈ విడుదలల షెడ్యూల్ నాని కెరీర్ కే స్పెషల్ అంశంగా మిగిలిపోతుంది.
21న వస్తున్నమనుషులతో జాగ్రత్త

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 21న వస్తున్న'మనుషులతో జాగ్రత్త'
 'I Hate Kissing On Screen': Karthi
 CBI Raids On AP Film Chamber Office In Hyderabad
 IT Raids On Super Good Films Office In Chennai
 Samanthas Controversy With A Tweet On 1 Poster
 1 తో అదీ తీరుతుందట
 అనామిక వచ్చే ఏడాదిలోనే
 హార్ట్ ఎటాక్తో పాటు
 ఏమో గుర్రం ఏగరావచ్చు సెన్సార్
 Srikanth Attends His Friends Sons Marriage
 Felt As If I Was Directing Chiranjeevi: YVS Chowdary
 Happy Birthday To Sesh Adivi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.