1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

1 విడుదల జనవరి 10నే

IndiaGlitz [Sunday, December 29, 2013]
Comments

మహేష్ హీరోగా నటిస్తున్న '1' నేనొక్కడినే సినిమా విడుదలలో మార్పు లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, అందువల్ల 13కి వాయిదా పడే అవకాశం ఉందని ఈ మధ్య కొన్ని రూమర్లు వచ్చాయి.

అయితే వాటిలో నిజం లేదని, తప్పకుండా సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 10నే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర చెప్పారు.

సుకుమార్ చాలా బాగా తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాకు భారీ బడ్జెట్, ఎక్కువ సమయం పడుతుందని తనకు సుకుమార్ ముందే చెప్పారని, యూనిట్ అంతా అందుకు సిద్ధమయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని మహేష్ అన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ సమకూర్చిన సంగీతం ఇటీవల విడుదలైన సంగతి విదితమే.
Minugurulu Team For 5K Walk On 4th January

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.