1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

చరణ్ కృష్ణవంశీ ల చిత్రం షురూ

IndiaGlitz [Thursday, February 06, 2014]
Comments

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఈ రోజు హైదరాబాద్ లో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో, శివబాబు బండ్ల సమర్పణ లో ప్రారంభమైన ఈ చిత్రం ముహర్తపు సన్నివేశానికి రామ్ చరణ్ క్లాప్ నివ్వగా, సత్యరంగయ్య తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ 'క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. కృష్ణవంశీ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఇలాంటి పాత్రల్లో నటించలేదు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు.

ఇప్పటి వరకు వారివురు నటించిన మగధీర, నాయక్, ఎవడు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. అదే విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. తమిళ నటుడు రాజ్ కిరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేస్తాం.

ఈ రోజు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ తర్వాత 40 రోజుల పాటు రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచ్చి షూటింగ్ ఉంటుంది.సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. మెగాభిమానులను అలరించే విధంగా సినిమా రూపొందుతుంది' అని అన్నారు.
Sweet Memories A Two Part Film By 3G Love Director

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Sweet Memories' A Two Part Film By '3G Love' Director
 'Basanthi' Song teaser Launched by NTR
 'Simple Love Story' Finishes Talkie Part
 Naga Chaitanya's 'Durga' Movie Muhurtham
 Venky Maruthi Film Radha Muhurtham
 Charan Krishna Vamsy Movie Takes Off With Muhurtham
 Paisa US Schedules
 Paisa $12 US Premiers
 I Visual Media New Film With Newbies
 Nikhils Next With Karthik Ghattamaneni
 Hotel Galaxy Inn Inaugurated By Actress Archana
 Preminchali Awarded Clean U BY Censor
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.