1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రాధా షూటింగ్ ప్రారంభం

IndiaGlitz [Thursday, February 06, 2014]
Comments

విక్టరీ వెంకటేష్, నయనతార ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా 'రాధా'. యూనివర్స్ ల్ మీడియా బ్యానర్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందునున్న ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత మూవీ మెఘల్ డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు.  ఏస్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ మారుతికి స్ర్కిప్ట్ అందించారు.

ఈ కార్యక్రమనికి డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, శరత్ మరార్, ఆశోక్ బాబు, గోపిచంద్ మలినేని, కోనవెంకట్, పరుచూరి ప్రసాద్, బెల్లం కొండ సురేష్ తదిత రులు హాజరైనారు. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ 'ఈ సినిమా పేరు విన గానే నాకు లక్ష్మి సినిమా గుర్తుకు వచ్చింది. మారుతి ప్రస్తుతం మా బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. కనుక తన గురించి నాకు బాగా తెలుసు. ఈ సినిమా కూడా లక్ష్మీ సినిమా లాగానే పెద్ద విజయం సాధింఆలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ కొత్త జంట సినిమా ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ఆనందంలో ఉండగానే వెంకటేష్ గారితో సినిమా అవకాశం రావడం నా  అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇమేజ్ కి తగినట్టుండే ఫ్యామిలీ అండ్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కొత్త వెంకటేష్ గారిని చూస్తారు. ఆయన ఇమేజ్ డబుల్ అవుతుంది. నయనతార మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది.
Sweet Memories A Two Part Film By 3G Love Director

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.