Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తెలుగులో బాలీవుడ్ రీమేక్..

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

సచిన్ జోషి పేరు మనకి బాగా గుర్తుంది కదా, 'మౌనమేలనోయి', 'నిను చూశాక', 'ఓరేయ్.. పండు' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు, 'ఆజాన్', 'ముంబై మిర్రర్', 'జాక్పాట్' సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ప్రస్తుతం సినిమాలేమీ చేయట్లేదు. తాజాగా ఒక బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన 'ఆషికి-2'ను తెలుగు  రీమేక్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

తెలుగులో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్,అల్లుఅర్జున్, రామ్ చరణ్ వంటి ఆగ్రహీరోలతో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. సచిన్ కి చెందిన వైకింగ్ మీడియా బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్, మిగతా టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

షూటింగ్ మార్చి నెలాఖరున ప్రారంభం కానున్నట్టు సమాచారం. బాలీవుడ్ ఘనవిజయం సాధించిన ప్రేమకథ 'ఆషికి-2' మరి తెలుగులో ఎలా తెరకెక్కనుందో అని చాలా మందిలో ఆసక్తి నెలకొంది.




గురువుకి శిష్యుడి సపోర్ట్



Other NEws

గురువుకి శిష్యుడి సపోర్ట్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.