1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్

IndiaGlitz [Friday, February 14, 2014]
Comments

దయా పిక్చర్స్ బ్యానర్ లో కిరణ్, ఫణిప్రకాష్, వర్ధన్, హిమజ నటీనటులుగా దయా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓ ముగ్గురి కథ'. కె.నరేందర్ రెడ్డి, కె.వరలక్ష్మి నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''ఇటీవల కొత్తవారు తీసే సినిమాలు బాగుంటున్నాయి. కొత్తవారు పరిశ్రమకి ఎంతో అవసరం. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'జీవితంలో ముగ్గురు యువకులు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. వారి జీవితాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే కథ. దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సినిమాని 25రోజుల్లో పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి' అన్నారు.

దర్శకుడు దయా మాట్లాడుతూ 'దర్శకుడిగా నా తొలి సినిమా. ముగ్గురు యువకుల ఆలోచనలు వారి బాధ్యతలతో ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేది సినిమా మార్చి నెలలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి'' అని తెలిపారు.Other News


RGVs Reddygaru Poyaru Firstlook

Minugurulu Presented The Vamsee Akkineni International Award

Filmmaker Balu Mahendra No More

Thegidi To Be Dubbed As Bhadram

RGVs Reddygaru Poyaru Firstlook

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.