Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ప్రారంభమైన 'మనసుపడిన కథ'

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

మార్నింగ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం 'మనసుపడిన కథ'. ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్, అరవింద్ కథానాయకులు. జె.ఎల్.వి.ప్రసాద్ సమర్పకులుగా గాదె భాను ప్రకాష్, అనితా రాహుల్ చౌదరి నిర్మాతలుగా రాజేష్ మందపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం శుక్రవారం ప్రేమికుల రోజును పురస్కరించుకుని హైదరాబాద్ లోని బుద్ధ విగ్రహం ప్రారంభమైంది. ముహర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ నిచ్చారు. కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

చిత్ర నిర్మాత భాను ప్రకాష్ మాట్లాడుతూ రాజేష్ చాలా కాలంగా తెలుసు. ఓసారి ఇద్దరం కలిసినపుడు సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రం తీయాలనుందని తనకు చెప్పాను. కొంతకాలానికి చక్కని కథను చెప్పాడు. రెండేళ్లు కష్టపడి ఈ కథను తయారు చేశాడు. రొమాంటిక్ లవ్ స్టోరి. యంగ్ టీమ్ తో చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు రాజేష్ మందపాటి మట్లాడతూ ''రెండేళ్లుగా కథ మీద వర్కవుట్ చేస్తున్నాను. ప్రేమంటే ఫీలింగ్ కాదు.. కొన్ని ఎథిక్స్ ఉంటాయని తెలిపే చిత్రమిది. వినోదంతో పాటు , సందేశం కూడా ఉంటుంది. హరోయిన్ ఎవరనేది ఆడియో ఫంక్షన్ లో తెలియజేస్తాం' అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకులు కార్తీక్, అరవింద్, సంగీత దర్శకుడు హరినికేష్ పాల్గొన్నారు.ఈ చిత్రానికి కెమెరాః అనిత్ కుమార్.




చిరంజీవి కూతురికి విడాకులు



Other NEws

చిరంజీవి కూతురికి విడాకులు

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.