Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'ఇదేగా ఆశపడ్డావ్' పాటల విడుదల

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

కాఫీ సినిమాస్, సప్తవర్ణ క్రియేషన్స్ సంయుక్తంగా విజయసేతుపతి, కలర్స్ స్వాతి, గౌతమ్,నందిత ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రాన్ని 'ఇదేగా ఆశపడ్డావ్'గా అందిస్తున్నారు. సమన్యరెడ్డి, సుజన్ నిర్మాతలు. గోకుల్ దర్శకుడు. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంగళవారం హైదరాబాద్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహత్, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, రఘుబాబు, సాయిరాజేష్, నిఖిల్, నందిత, గౌతమ్, సమన్యరెడ్డి, గోకుల్,స్వాతి, సిద్ధార్థ్ విపిన్, హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను సాయిరాజేష్, రఘబాబు విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించగా తొలి సీడీని సందీప్ కిషన్ అందుకున్నారు.

ఈ సందర్భంగా...దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'సంగీత దర్శకుడికి కంగ్రాట్స్. మ్యూజిక్ బాగుంది. గోకుల్ డైరెక్షన్ సూపర్. విజయ్ సేతుపతి మంచి ఈజ్ ఉన్న నటుడు. స్వాతి ఇటు తమిళంలోనూ, తెలుగులోనూ మంచి సినిమాలు చేస్తుంది. ట్రైలర్స్, విజువల్స్ బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

సంగీత దర్శకుడు సిద్ధార్థ్ విపిన్ మాట్లాడుతూ 'దర్శకుడు గోకుల్ సినిమాకి అవసరమైన సంగీతాన్ని నా నుండి రాబట్టుకున్నారు. తమిళంలో ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే తెలుగులోనూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. పాట పాడిన సందీప్ కిషన్ కి థాంక్స్' అని చెప్పారు.




కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ



Other News

 'Temper' trailer review
 Brahmaji's son to enter industry
 Sharwanand with Sundeep Kishan's director
 'Temper' audio launch details
 Happy Birthday to the multi talented beauty
 Bandla Ganesh confirms 'Temper' release Muhurat
 "It will be Chiranjeevi's biggest mistake"
 'Beeruva' Success Tour
 All set for 'Temper' audio launch
 Kalyan Ram to work with Prabhas ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.