1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నా లవ్ స్టోరికి యు సర్టిఫికేట్

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ నటుడు ధనుష్ నిర్మించిన సినిమా 'ఎదిర్ నీచ్చల్'.  ఈ సినిమాని తెలుగులో 'నా లవ్ స్టోరి మొదలైంది'గా విడుదల చేస్తున్నారు. వెంధార్ మూవీస్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో రామాంజనేయులు.జె తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందిస్తున్నారు. ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. అనిరుధ్ సంగీత దర్శకుడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామాంజనేయులు జె. మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం ప్లస్ అవుతుంది. ఇందులో ధనుష్, నయనతార కలిసి ఓ ప్రత్యేక గీతంలో నర్తించడం విశేషం. ఈ సినిమా తెలుగు నెటివిటీకి చాలా దగ్గరగా ఉండటంతో ఈ సినిమా రైట్స్ కొని తెలుగులో విడుదల చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది' అన్నారు.
Vamsy Paidipally To Direct NagNTR ?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.