Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'రౌడీ' ట్రైలర్స్ రివ్యూ

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవి పిక్చర్స్  బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'రౌడీ'. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్నాడు. మోహన్ బాబుకు జోడిగా జయసుధ నటిస్తుండగా, విష్ణు సరసన శాన్వి నటిస్తుంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సిని మా ట్రైలర్ విడుదలైంది. ఉహించినట్లుగానే అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్స్ ఉంది. ట్రైలర్ ప్రారంభంలో విష్ణు, శాన్వి జంట కనపడుతుంది. మోహన్ బాబు ఎంట్రీతో ట్రైలర్ లో కిక్ వచ్చింది. ట్రైలర్ లో విష్ణుకి పెద్దగా డైలాగ్స్ లేవు.

మోహన్ బాబు డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. 'అమ్మోరుని పోలిన అమ్మవు నీవేలే...' అనే సాంగ్ మాత్రం ఉంది.'ప్రతి కుక్కకు సింహం కావాలనే ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంది..'. అనే డైలాగ్, 'రెస్పెక్ట్..' అనే డైలాగ్, ఇలా ట్రైలర్ లో ప్రతి డైలాగ్ సూపర్.

రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబుని ఓరిజినల్ గెటప్ తో చూపించాడు.కొద్దిగా వయసు మళ్లిన వాళ్లు నడిచినట్టు ఉండే కలెక్షన్ కింగ్ నడక ప్రతి విషయంలో మోహన్ బాబు హైలైట్ అయ్యాడు. కొన్ని సీన్స్ లో మోహన్ బాబు గాయపడి విష్ణుకి ఏదో సర్ధి చెప్పాలని ప్రయత్నించడం, చివర్లో విష్ణు టీ తాగే సన్నివేశం లాంటివి 'సర్కార్' సినిమాని పోలి ఉంది. 'సర్కార్' సినిమా కథనే రామ్ గోపాల్ వర్మ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కించాడేమోనని కొందరు అనుకుంటున్నారు.

Watch Rowdy Movie Trailer




TarunSrikanth Veta On 21st March





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.