1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నగ్నసత్యం సెన్సార్ పూర్తి

IndiaGlitz [Tuesday, March 11, 2014]
Comments

మన రాష్ర్టంలో జరిగిన ఓ స్ర్ర్తీ ఉదంతాన్ని కథాంశంగా తీసుకుని సంచలనం పాకిస్థానీ కథానాయిక వీణామాలిక్ ప్రధానపాత్రలో అనురాధా ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'నగ్నసత్యం'. కూరపాటి రామారావు దర్శకుడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సినిమాకి ఎ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'సెన్సార్ సభ్యులు ఈ నాటి సమాజంలో జరుగుతున్న విషయాల వెనుక దాగివున్న నగ్న సత్యాలను ఈ చిత్రంలో చూపించామని మెచ్చుకున్నారు. వీణామాలిక్ భాష రాకపోయినా చక్కగా నటించింది. దర్శకుడు కూరపాటి రామారావు చక్కగా తెరకెక్కించాడు. మా బ్యానర్ కి, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో వీణామాలిక్ కి జతగా దర్శకుడు, నటుడు రవిబాబు నటించారు' అన్నారు.

చలపతిరావు, జాకీ, విజయ్, ఆర్.కె తదితరులు నటించిన ఈ సినిమా సంగీతం: శంభుప్రసాద్, నిర్మాతః చదలవాడ శ్రీనివాసరావు,కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: కూరపాటి రామారావు.
14న పవన్ పొలిటికల్ మీటింగ్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.