1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనసేనతో ప్రజల్లోకి పవన్

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నాడనగానే ఎప్పుడు వస్తాడు, పార్టీ పేరు ఏమై ఉంటుంది.అనే ప్రశ్నలు చాలానే వినిపించాయి. పవన్ రిపబ్లిక్ పార్గీ పేరుతో పిఆర్ పిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ పవన్ శిబిరం నుండి ఎటువంటి స్పందన లేదు. ఈ నెల 14న ప్రజలను, అభిమానులనుద్దేశించి పవన్ మాదాపూర్ లోని హైటెక్స్ లో ప్రసంగించడం కూడా ఓకే అయ్యింది. ఈ సభలో పవన్ 45నిమిషాలు పాటు ప్రసంగించనున్నాడని, రాజకీయాలపై తన అభిప్రాయాలతో రాసిన పుస్తకాన్ని విడుదల చేయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ తన పార్టీ పేరును పవన్ రిపబ్లిక్ పార్టీ అని కాకుండా జనసేన అనే పేరుతో స్థాపించనున్నాడని విషయం తెలిసింది. ఈ పేరుతో పార్టీని స్థాపించాలనుకుంటున్నట్టు పవన్ ఓ డిక్లరేషన్ కాపీని  సోమవారం ఎన్నికల కమిషనర్ ఆఫీస్ లో తనే స్వయంగా అందచేసినట్టు సమాచారం. దీంతో పవన్ రాజకీయాల్లోకి వస్తాడనే విషయం తేటతెల్లమైంది. మరి తన ప్రత్యర్థులు నుండి వచ్చేప్రశ్నలకు ఏమని సమాధానం ఇస్తాడో, ప్రజలకు ఏమని సందేశం ఇస్తాడోనని ఎదరుచూస్తున్నారు.




Pawan Kalyans Party Jana Sena



Other News


Dollars Colany Completes 70% Shooting

Is Race Gurram On 4th April ?

Jagannayakudu Wraps Up Shooting





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.