1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్యార్ మే పడిపోయానే టీజర్ లాంఛ్

IndiaGlitz [Friday, March 21, 2014]
Comments

శ్రీ సత్యసాయి  ఆర్ట్స్ బ్యానర్ లో రాక్ స్టార్ ఆది, లవ్ లీ ఫేమ్ శాన్వి జంటగా రవికుమార్ చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ప్యార్ మే పడిపోయానే'. ఈ సినిమా టీజర్  హైదరాబాద్ లోని ప్రసాద్ థియేటర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా....

దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ 'ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ. రవికుమార్ చాలా చక్కగా చేస్తున్నాడు. కామెడీ ఎక్స్ ప్రెషన్స్ ను పండించాలంటే అంత సులభం కాదు. కానీ ఆది ఒక సీనియర్ నటుడు చేసినట్లు చేస్తున్నాడు.టైమింగ్ బాగుంది. అందరూ సపోర్ట్ కారణంగా సినిమా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది' అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 'టాకీపార్ట్ నెల క్రితమే పూర్తైంది. రెండు పాటల్ని మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.కులుమనాలిలో ఈ రెండు పాటల్ని చిత్రీకరించబోతున్నాం. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. రెండు పాటల్ని పూర్తి చేసి ఏప్రిల్ మొదటివారం లేక రెండోవారంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సపోర్ట్ చేస్తున్న వారందరికి ధన్యవాదాలు' అని తెలిపారు.

హీరో ఆది మాట్లాడుతూ  'ఇందులో హీరోయిజం ఎలివేట్ అయ్యేలా కాకుండా చాలా కూల్ గా కొత్త లుక్ తో కనపడతాను. లవ్ లీ తర్వాత చేస్తున్న అవుటండ్ అవుట్ లవ్ స్టోరీ ఇది. సామాన్యుడులో డాడీని ఎలాగైతే డిఫెరెంట్ గా రవిచావలి చూపారో అలాగే ఈ సినిమాలోనూ డిపెరెంట్ గా కనపడతాను. మంచి టీమ్ తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

Watch 'Pyar Mein Padipoyane' Trailer
Sampoornesh Babu as a scientist in Hrudaya Kaleyam

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.