1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

11న ఇంద్రుడు ఆడియో

IndiaGlitz [Sunday, March 23, 2014]
Comments

యూ టివి మోషన్ పిక్చర్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఇంద్రుడు'. విశాల్, లక్ష్మీమీనన్ హీరోహీరోయిన్స్. తమిళంలో 'నాన్ సిగప్పు మనిదన్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ఇంద్రుడు విడుదలకు సిద్ధమవుతుంది.

సిద్ధార్థ్ రాయ్ కపూర్, విశాల్ నిర్మాతలు. తిరు దర్శకుడు. జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వేసవికి తెలుగులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 'పందెంకోడి', 'పొగరు', 'భరణి' తర్వాత తెలుగులో విశాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోతున్నాడు.

ఇటీవల విశాల్ హీరోగా తెలుగులో విడుదలైన అనువాద చిత్రం 'పల్నాడు' మన నెటివిటికి దగ్గరగా లేకపోవడంతో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో విశాల్ ఓ మానసిక రోగంతో బాధపడే యువకుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొ్ట్టాలని యూనివర్సల్ కాన్సెప్ట్ తో ముందుకువస్తున్నాడు.

ఈ సినిమా ఆడియోను ఈ ఏప్రిల్ 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మరి ఈ సినిమాతో విశాల్ తెలుగులో మరోసారి తన సత్తా చూపిస్తాడేమో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.

Watch 'Indrudu' TrailersOther News


Balakrishnas Legend ready for censor

Shruti Haasan having the best time ever

Prakash Rajs huge budgeted movie with Nagarjuna

Ee Premalo Anni Ekkuve as Ugadi gift

Balakrishnas Legend ready for censor

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.