1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పిచ్చెక్కిస్తా ట్రైలర్

IndiaGlitz [Wednesday, April 02, 2014]
Comments

సెవెన్ ఆర్ట్స్, మానస ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా 'పిచ్చెక్కిస్తా'. రాజశేఖర్ లంక నిర్మాతగా శ్రీకాంత్ బి.రెడ్డి దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఎన్.కె, హరిణి నటీనటులు. ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం ఫిలింఛాంబర్ లో విడుదల చేశారు. నటుడు, నిర్మాత ఆశోక్ కుమార్ ఈ సినిమా ట్రైలర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

ఆశోక్ కుమార్ మాట్లాడుతూ 'చక్కటి ప్రణాళిక ఉంటే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయి. ఈ సినిమా ట్రైలర్స్ చూశాక తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్మకంగా ఉంది. బడ్జెట్ తగిన విధంగా ప్రమోషన్ కూడా ఉండాలి. టీమ్ అందరికి నా అభినందనలు' అని తెలిపారు.

చిత్ర నిర్మాత రాజశేఖర్ లంక మాట్లాడుతూ 'దర్శకుడు  కథ చెప్పగానే బాగా నచ్చింది. ఎంటర్ టైన్ తో పిచ్చెక్కెస్తుందనిపించింది. ట్రైలర్స్ చూశాక దర్శకుడిపై నమ్మకం పెరిగింది. మరో పది రోజుల్లో ఆడియో విడుదల చేసి మే రెండో వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్.బి మాట్లాడుతూ 'ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ దగ్గర కథ, స్ర్కీన్ ప్లే నేర్చుకున్నాను. వినోదాత్మకంగా సాగే ప్రేమకథాచిత్రమిది.  తప్పకుండా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో ఎన్.కె, హరిణి, సాయివెంకట్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Watch 'Pichekkistha' Trailers
9న వీకెండ్ లవ్ ఆడియోOther News


Weekend Love audio on April 9th

He requested me not to smile : Vishnu Manchu

Maniratnams spy thriller with Mahesh and Nagarjuna

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.