1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆషికి2 రీమేక్ ప్రారంభం

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

సచిన్ జోషి, నజీయా హరోహరోయిన్లుగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. హిందీలో ఘన విజయం సాధించిన 'ఆషికి-2' సినిమాకి ఇది రీమేక్. జయరవీంద్ర దర్శకుడు. తొలి సన్నివేశానికి జెమిని కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, జయంత్ క్లాప్ నివ్వగా రంజిత్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా ..

బండ్లగణేష్ మాట్లాడుతూ 'హిందీ దబాంగ్ ను గబ్బర్ సింగ్ గా తెరకెక్కిస్తే పెద్ద హిట్టయ్యింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టవుతుంది. ఒకే షెడ్యూల్ లో సినిమాని పూర్తి చేసి జూన్ లో విడుదల చేస్తాం. హిందీ పాటలను తెలుగులోనూ వాడుతున్నాం. సంజయ్ దత్ మేనకోడలు ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతుంది. సినిమాని హైదరాబాద్, గోవా, ప్యారిస్ లలో తెరకెక్కిస్తాం' అని అన్నారు.

సచిన్ జోషి మాట్లాడుతూ 'చానాళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఒరే పండు తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. ఆషికి-2 బ్లాక్ బస్టర్ సినిమా చంద్రబోస్ తెలుగులో పాటలు రాస్తున్నారు' అని అన్నారు.

నజీయా మాట్లాడుతూ 'తెలుగులో నా తొలి సినిమా. మంచి రోల్ ద్వా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది' అని తెలిపారు.

రావురమేష్, శశాంక్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మాటలుః మధుసూదన్, పాటలుః చంద్రబోస్, సంగీతం: అంకిత్ తివారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎన్.చంద్రశేఖర్,నిర్మాతః బండ్లగణేష్, దర్శకత్వం: జయ రవీంద్ర.Other News


Sachin Bandla Ganeshs Aashiqui 2 remake launched

Mohan Babus role in Rowdy for National award

Harish Shankar to direct Sai Dharam Tej

Balakrishnas next movie details

Sachin Bandla Ganeshs Aashiqui 2 remake launched

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.