1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్రోకర్2 పాటలు విడుదల

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

మద్దినేని దర్శకత్వంలో డైరెక్టర్స్ సినిమా బ్యానర్ పై పోసానికృష్ణమురళి కీలకపాత్రలో నటిస్తున్న సినిమా 'బ్రోకర్-2'. ఈ సినిమా ఆడియో లాంఛ్ శుక్రవారం హైదరాబాద్ లో జగింది. దర్శకరత్న దాసరినారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

పోసానికృష్ణమురళి మాట్లాడుతూ 'నేను నటుడిగా కొనసాగాలనుకుంటున్నాను. నా కష్టానికి నా రూపాయిని అడుగుతాను. దాసరినారాయణరావుగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. మద్దినేని రమేష్ అద్దంలాంటి వ్యక్తి' అని అన్నారు.

సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 'ఈ సినిమా పాటల్లో సామాజిక చైతన్యం కనపడుతుంది. ఇప్పుడు సినిమా పరిశ్రమలో కేంద్రీకరణ పెరుగుతోంది. అది మంచిది కాదు. థియేటర్లు కొందరి చేతిలో ఉండటం సబబు కాదు. థియేటర్ల విషయంలో కళా ఉద్యమం మొదలైతే మా సపోర్ట్ ఉంటుంది.  కేంద్రీకరణ వల్లనే రాష్ర్టం రెండు ముక్కలైంది' అని అన్నారు.

నిర్మాత మద్దినేని రమేష్ మాట్లాడుతూ 'సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
దాసరినారాయణ రావు మట్లాడుతూ 'బ్రోకర్-2ను కమిట్ మెంట్ తో తీశారు. పోసాని కృష్ణమురళి కమర్షియల్ నటుడు.థియేటర్ల సమస్య కారణంగా 200 సినిమాలకు పైగా తొలికాపీలు వచ్చి ఆగిపోయాయి. అసమర్ధ ప్రభుత్వాల కారణంగానే ఈ థియేటర్ల సమస్యలు ఏర్పడుతున్నాయి' అని అన్నారు.Other News


MAA TV buys Hrudaya Kaleyam rights for a good amount

నదీతీరం ప్రారంభం

జగన్నాయకుడు ఆడియో విడుదల

Samantha declares her support to Modi

MAA TV buys Hrudaya Kaleyam rights for a good amount

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.