1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బందిపోటుగా అల్లరినరేష్

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

ఈ జనరేషన్ కామెడీ చిత్రాలకు ట్రేడ్ మార్క్ హీరో అల్లరి నరేష్. అతను నటించిన చిత్రాలన్ని కామెడీయే ఏదో ఒకటో రెండో తప్ప. ఈ ఏడాది కూడా 'లడ్డూబాబు' విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో సినిమా 'జంప్ జిలాని' చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఈ రెండు సినిమాలు నరేష్ కి ప్రత్యేకమే ఎందుకంటే 'లడ్డూబాబు'లోలో కొత్తగెటప్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతుండగా, 'జంప్ జిలాని'లో మొదటిసారి డబుల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'అష్టాచమ్మా', 'అంతకుమందు ఆతర్వాత' వంటి సినిమాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో జతకడుతున్నాడు. ఈ సినిమా టైటిల్ 'బందిపోటు'. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా నరేష్ నాన్నగారు, దర్శకుడు ఇవివి సత్యనారాయణ బ్యానర్ ఇ.వి.వి. సినిమాస్ పై తెరకెక్కనుంది. సొంత బ్యానర్ లో మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి పనిచేస్తుండడం అల్లరినరేష్ కి చాలా ఆనందంగా ఉంది.  ఏమైనా ఈ సంవత్సరం అల్లరోడి అల్లరితో ప్రేక్షకులకు కామెడీ గ్యారంటీ అని మాత్రం తెలుస్తుంది.Other News


Pattapagalu First Look

Race Gurram censor completed

Prabhas to take a long break after Baahubali ?

Smithas new album supporting Narendra Modi

Pattapagalu First Look

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.