1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రాష్ట్రపతి రాక రాఘవేంద్ర రావు

IndiaGlitz [Sunday, May 25, 2014]
Comments
మనకి పనికొచ్చేది అట్టడుగు పొరల్లో వున్నా పసిగట్ట గలిగే చూపు కొందరికే వుంటుంది. అటువంటి 'గ్రాస్పింగ్ ఐ' గలవారిలో దర్శకుడు రాఘవేంద్ర రావు ఒకరని నిరూపించే సంఘటన ఇది. సంగీత దర్శకుడు చక్రవర్తి, రాఘవేంద్ర రావు కలిసి ఓ సారి తిరుపతికెళ్ళారు. అదే సమయానికి భారత రాష్ట్రపతి జైల్ సింగ్ కూడా తన పర్యటనలో ఓ భాగంగా అక్కడకొచ్చారు. భారత రాష్ట్రపతి కావడం సెక్యూరిటీ టైట్ గా వుండడమే కాకుండా ట్రాఫిక్ ని కూడా చాలా రూట్స్ లో మళ్ళించాల్సి వచ్చింది. 

ఏ రూట్ లో వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావడం, మరో రూట్ ట్రై చెయ్యడం చక్రవరికి కోపం నసాళానికంటింది. 'జైల్ సింగు తిరపతొ్చ్చాడూ ... ఓ ... ఓ... ఓ...అంటూ గాట్టిగా ఓ రాగం ఎత్తుకున్నారు. 'మళ్ళీ అను' అని అన్నారు రాఘవేంద్రరావు. సరదాకన్నారనుకుని మళ్ళీ అదే హుషారుతో పాడేరాయన. 'ఈ ట్యూన్ దాచి వుంచు.. మనకి పనికొస్తుంది' అని అన్నారు రాఘవేంద్రరావు. చక్రవర్తి బిత్తరపోలేదు గానీ రాఘవేంద్ర రావు ఎందుకు చెప్పారో ఏమోనని రికార్డ్ చేసి పెట్టుకున్నారు.

'అడవి సింహాలు' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో ' చక్రవర్తీ ... ఆ రోజు తిరపతిలో జైల్ సింగ్ మీద హమ్ చేశావే ... అదోసారి అను' అని అన్నారు. అలాగే హమ్ చక్రవర్తి. ఆ ట్యూన్ కి వేటూరి రాసిన పాటే - 'అగ్గిపుల్ల భగ్గుమంటదిఆడపిల్ల సిగ్గులంటది' . సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజుల్లో ఆ పాట ఎంత పాపులరయిందో అందరికీ తెలుసు.



New innings for Naga Chaitanya in Tollywood !



Other News


Ranveer & Deepika are free from legal web

Ranbir Akshay Arjun turn XMen

Akshay Kumar & Sonakshi to promote Holiday in Hyderabad





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D Screens
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.