1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రారా కృష్ణయ్య ఆడియో విడుదల

IndiaGlitz [Saturday, May 31, 2014]
Comments
View Ra Ra Krishnayya Audio Launch Gallery
View Ra Ra Krishnayya Audio Launch Gallery

సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎస్.వి.కె.సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా 'రారా కృష్ణయ్య'. వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత. మహేష్ బాబు. పి దర్శకుడు. జగపతిబు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో శుక్రవారం హైదరాబాద్ లో విడుదలైంది. అల్లరి నరేష్,ఆది ట్రైలర్స్ ను ఆవిష్కరించారు. హరీష్ శంకర్ తొలి సీడీని విడుదల చేయగా మంచు లక్ష్మి తొలి కాపీని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, జగపతిబాబు, మంచు లక్ష్మీ,జెమినికిరణ్, మేర్లపాక గాందీ, అనిల్ సుంకర, జెమిని కిరణ్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, రాహుల్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ ''ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమానుభూతి సమ్మేళనమే ఈ సినిమా. అచ్చు ఐదుపాటలను అందించారు. కెమెరా పనితనం బాగుంది. జగపతిబాబు చాలా కీలకరోల్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్'' అన్నారు.

నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ ''దర్శకుడు చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. సందీప్  ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా మారుతాడు. జగపతిబాబుతో పనిచేయడం ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూన్ లో సినిమాని విడుదల చేస్తాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరు సినిమా సక్సెస్ కావాలని అభిలషించారు.Other News


Anil Sunkara to produce Gopi Mohans directorial debut

Mahesh babu targeted those heroes ?

Happy Birthday Super Star Krishna

Allu Arjun confirmed as Gona Ganna Reddy in Rudrama Devi

Anil Sunkara to produce Gopi Mohans directorial debut

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.