1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మనం లాంటి సినిమా చేయడం కష్టం

IndiaGlitz [Sunday, June 08, 2014]
Comments
View Nagarjuna Gallery
View Nagarjuna Gallery

అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం' ఇటీవల విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్స్ పరంగా అక్కినేని హీరోలకు ట్రేడ్ మార్క్ సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ''సినిమా విజయం సాధించినందుకు ఒకపక్క మా ఫ్యామిలీ హ్యపీగా ఉన్నా, ఇంత పెద్ద సక్సెస్ ను మాకందించిన నాన్నగారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధగా ఉంది. అందుకనే ఇంత పెద్ద సక్సెస్ ను సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం.

నా గత చిత్రాలు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాంతో నా డిసిషన్ మేకింగ్ ఏదో సమస్య ఉందంటూ నాన్నగారితో అన్నాను. కానీ ఆయన నాకు ధైర్యం చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత నాన్నగారికి మంచి చిత్రాన్ని కానుకగా ఇచ్చానని అన్నారు. కానీ నిజానికి ఆయనే మాకు సినిమా అంటే ఇలా తీయాలిరా అనేంత గొప్ప సినిమాని కానుకగా ఇచ్చారు. కమల్ హాసన్ సినిమా చూసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారని సినిమా కోసం ఏదైనా చేయాలా అని అడిగారు.

నాన్నగారితో తను అనుభవాలను నాతో చెప్పుకున్నారుకలెక్షన్స్ గురించి నేను ఆలోచించటం లేదు. కానీ మనం లాంటి సినిమాని మూడు తరాలతో నటులతో సినిమాని ఎవరు చేయలేరని కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో నాకు బిట్టు పాత్ర బాగా నచ్చింది. కానీ సీతా క్యారెక్టర్ బాగుంటుంది. పొయిటిక్ గా ఉంటుంది.  నటన పరంగా చూస్తే చైతన్యకే ఫస్ట్ మార్కులు వేస్తాను.

ఎందుకంటే తను చేసిన రెండు క్యారెక్టర్స్ భిన్నమైనవి, టఫ్ రోల్స్. తను చక్కగా చేశాడు. అలాగే సమంత, శ్రియ కూడా చక్కగా నటించారు. నాకు చైతన్యకే కాదు, అఖిల్ కి కూడా మంచి ఇంట్రడక్షన్ సినిమా అయ్యింది. 30 సెకండ్ల పాత్రలో ఎవరైనా బాగానే కనపడతారు. కానీ రెండు మూడు గంటల సినిమాలో మెప్పించడం చాలా కష్టం. అందుకని చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోమని చెప్పాను. అందుకనే తను అందరి రెస్పాన్స్ తీసుకుంటున్నాడు.

మహేష్, తారక్ లు కూడా సినిమా చూశారు. మహేష్ అయితే ఇంత మంచి సినిమాని ఎలా డిసైడ్ చేసుకున్నారు. కథను ఎలా జడ్జ్ చేశారు అన్నాడు. తారక్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఏ మాత్రం తగ్గకూడదని కథలో మార్పులు చేయమని చెప్పాడు. ఇకమీదట నా వయసుకి తగిన విధంగా మల్టీస్టారర్  సినిమాలు కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో  చేస్తున్నాను. ప్రస్తుతానికి 45 ఏపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
రుబాబు చేయనున్న ఎన్టీఆర్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.