1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కుల్ఫీ ఆడియో విడుదల

IndiaGlitz [Tuesday, June 10, 2014]
Comments
View Kulfi Audio Launch Gallery
View Kulfi Audio Launch Gallery

జై, స్వాతి జంటగా ఎస్.ఎన్.ఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా 'కుల్ఫీ'. 'వడకరి' పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాని కుల్ఫీ పేరుతో తెలుగు ప్రేక్షకులకు నరసింహారెడ్డి సామల అందిస్తున్నారు. శరవణరాజన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా, వివేక్ ప్రభు, మెర్విన్ సాల్మన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సోమవారం హైదరాబాద్ లో విడుదలైంది. బిగ్ సీడీని సముద్ర, సురేష్ కొండేటి విడుదల చేశారు. ఆడియో సీడీలను సాగర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, వనమాలి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత నరసింహారెడ్డి సామల మాట్లాడుతూ "తమిళంలో వడకరి పేరుతో నిర్మితమైన ఈ చిత్రాన్ని కుల్ఫీ పేరుతో విడుదల చేస్తున్నాం. ఐ ఫోన్ చుట్టూ తిరిగే కథాంశం. సన్నిలియోన్ నటించిన మొదటి చిత్రమిది. యూత్ కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి. జూన్ మూడో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు

డైరెక్టర్ శరవణరాజన్ మాట్లాడుతూ "సినిమాని సరాదాగా చేశాం. సినిమా కూడా సరాదాగానే సాగుతుంది. అల్రెడి తమిళ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

స్వాతి మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చంది అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి, సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్స్ కి , టెక్నిషియన్స్ కి థాంక్స్" అన్నారు.

సంగీత దర్శకులు శివ, మెర్విన్ మాట్లుడూ "సినిమాలో ఐదు పాటలుంటాయి. తమిళంలో ఆడియో మంచి సక్సెస్ సాధించింది. తెలుగులో కూడా హిట్టవుతుందని నమ్మకం ఉంది" అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, వివేక్ శివ, మెర్విన్ సాల్మన్, మాటలు: కృష్ణతేజ, కెమెరా: ఎస్.వెంకటేష్, నిర్మాణ, నిర్వహణ: ఎ.ఎన్.బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాత: నరసింహారెడ్డి సామల, కథ, స్క్కీన్ ప్లే, దర్శకత్వం: శరవణరాజన్.
Special birthday for Balakrishna

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.