1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

గాలిపటం లోగో లాంఛ్

IndiaGlitz [Tuesday, June 17, 2014]
Comments
View Gaalipatam Logo Launch Gallery
View Gaalipatam Logo Launch Gallery

సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజిల్స్ టాకీస్ సంయుక్తంగా ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా హీరోహీరోయిన్స్ గా రూపొందిస్తున్న సినిమా 'గాలిపటం'. సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి నిర్మాతలు. నవీన్ గాంధీ దర్శకుడు. ఈ సినిమా లోగో , ఫస్ట్ లుక్ హైదరాబాద్ లో విడుదలైంది. సాయికుమార్ దంపతులు లోగో లాంఛ్ చేయగా, వి.వి.వినాయక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

నవీన్ గాంధీ మాట్లాడుతూ ''సినిమా అనుకున్నట్లుగానే చక్కగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో రూపొందుతుంది. అందరికి నచ్చుతుంది'' అన్నారు.

సంపత్ నంది మాట్లాడుతూ ''అసలు నా ఏజ్ కి, ఎక్స్ పీరియెన్స్ కి ప్రొడక్షన్ చేస్తే మంచిదా అని ఆలోచించాను. కానీ నా స్నేహితులు, టెక్నిషియన్స్, టీమ్ కోసం ఈ బాధ్యత తీసుకున్నాను. బోల్డ్ అటెంప్ట్ చేస్తున్నాం. ఇంత వరకు సౌత్ లోరాని కాంటెంపరరీ సబ్జెక్ట్. యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సంవత్సరం విడుదలయ్యే సినిమాల్లో హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ ''నేను చేసిన సినిమాలన్నింటిలో డిఫెరెంట్ మూవీ. నా మొదటి సినిమానే నవీన్ గాంధీతో చేయాల్సింది. కుదరలేదు.  ఈ సినిమాకి కుదిరింది. నా బాడీలాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. యూత్ ఫుల్ సబ్జెక్ట్. యంగ్ టీమ్ తో కలిసి పనిచేశాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో క్రిస్టినా, ప్రీతి రానా, సాయికుమార్ దంపతులు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తదితరులు పాల్గొన్నారు.
Drishyam to cut a New Genre Wave in Telugu Cinema

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.