1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అల్లుడు శీను ఆడియో విడుదల

IndiaGlitz [Sunday, June 29, 2014]
Comments
View Alludu Seenu Audio Launch Gallery
View Alludu Seenu Audio Launch Gallery

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తోన్న  సినిమా ‘అల్లుడు శీను’. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగింది.

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, రాజమౌళి,  నల్లమలుపు బుజ్జి, అలంకార్ ప్రసాద్, కాశీ, బండ్లగణేష్, బ్రహ్మానందం, కోనవెంకట్, గోపిమోహన్, మారుతి, దిల్ రాజు, గోపిచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్, మెహర్ రమేష్, బాబీతో పాటు చిత్రయూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను విడుదల చేయగా తొలి సీడీని రాజమౌళి అందుకున్నారు.

థియేట్రికల్ ట్రైలర్ ను రాజమౌళి విడుదల చేశారు. టీజర్ ను బ్రహ్మానందం విడుదల చేశారు.  ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు శ్రేయోభిలాషులు సాయిశ్రీనివాస్ భవిష్యత్ లో తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా ఎదుగుతాడని, ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ ను సాధిస్తుందని అన్నారు. చిత్రయూనిట్ ను అభినందించారు.
NTR & Nagarjuna to listen the final narration by month end

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.