1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆయన కోరిక అదే అల్లరి నరేష్

IndiaGlitz [Monday, June 30, 2014]
Comments

తన కామెడితో ప్రేక్షకులకు కితకితలు పెడుతన్న కామెడి హీరో అల్లరి నరేష్. దర్శకుడిని చేయాలని తండ్రి భావిస్తే హీరోగా మారాడు. తన కామెడి టైమింగ్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే ఈ సీమటపాకాయ్  ఈ నెల 30న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ పట్టినరోజు సందర్భంగా ఈ అల్లరోడుతో జరిపిని ఇంటర్వ్యూ విశేషాలు..

ఈ పుట్టినరోజు స్పెషల్...

ఈ సంవత్సరం ఇప్పటి వరకు బాగానే జరిగింది. ఈ సంవత్సరం నేను, రాజేష్ కలిసి నాన్నగారి బ్యానర్ ను మళ్టీ స్టార్ట్ చేశాం.  ప్రస్తుతం బందిపోటు సినిమా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మా బ్యానర్ నుండి మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అందులో ఒకటి నేను హీరోగా యాక్ట్ చేస్తే మిగతా రెండు సినిమాల్లో వేరే హీరోలు నటిస్తారు.

బందిపోటు విశేషాలు..

మంచి కాన్సెప్ట్. ఇంద్రగంటి మోహనకృష్ణ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందుకే మా బ్యానర్ లో చేస్తున్నాం. ఇది రాబిన్ హుడ్ తరహా చిత్రం. తన తెలివి తేటలతో ఉన్నవాళ్లని దోచుకునే తెలివైన దొంగ. ఈ జూలై1న రాజమండ్రిలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ 20వరకు రాజమండ్రిలో జరుగుతుంది.

స్కూప్స్ చేయను...

ఇప్పుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో, అలాగే బందిపోటు సినిమాలో స్కూప్స్ ఉండవు. సుడిగాడు సినిమా టైమ్ లోనే స్కూప్స్ చేయనని అందరికి చెప్పేశాను. ఇప్పడు నా వద్దకి వస్తున్న దర్శక, నిర్మాతలకు అదే విషయాన్ని చెబుతున్నాను.

జయాపజయాలు సాదారణమే..

అన్ని సినిమాలు బాగా ఆడాలనే చేస్తాం. బాగా ఆడకపోతే బాధగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాగా ఇష్టపడి చేసిన సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. కానీ అన్నింటికి పడే కష్టం ఒకటే. లడ్డుబాబు కూడా డైటింగ్ విషయంలోకానీ, మేకప్ విషయంలో కానీ చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కానీ ప్రేక్షకులు నేను చేసే ప్రతి సినిమాలో, సన్నివేశంలో కామెడి కోరకుంటున్నారు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను రీచ్ కాలేదనుకుంటాను.  హిట్స్, ప్లాప్స్ రెండు సర్వ సాదారణమే. అయితే ప్లాప్స్ వచ్చినప్పుడు మనం ఏం తప్పులు చేశామని చూసుకుని వాటిని రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

రీమేక్ లు చేయను..

నాన్నగారు చేసిన ఆ..ఒక్కటి ఆడక్కు, జంబలకిడిపంబ, హలో బ్రదర్ నాకు చాలా ఇష్టం. వీటిని రీమేక్ చేద్దామని చాలా మంది అన్నారు కూడా. కానీ అవి క్లాసిక్ మూవీస్ వాటిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు.

డైరెక్షన్  ఐడియా..

2017లో డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. నాన్నగారు నన్ను డైరెక్టర్ చేయాలనుకున్నారు. కానీ నేను హీరో అయ్యాను. ఆయన కోరిక మేర డైరెక్టర్ కావాలనుకుంటున్నాను.

50వ సినిమా...

వచ్చే సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. అన్నీ సినిమల్లాగానే  ఆ సినిమా కూడా ఉంటుంది. అయితే ఏ బ్యానర్లో చేస్తాననేది ఇంకా డిసైడ్ కాలేదు. కథలు వింటున్నాను. మంచి కథ కుదరగానే వివరాలు తెలియజేస్తాను.

చిన్నికృష్ణ సినిమా ..      

చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా నాలుగు రోజుల టాకీ, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అన్నింటిని పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలనుకుంటన్నాం. కామెడిగా సాగే సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. కార్తీక చక్కగా నటించింది.

ట్రస్ట్ వివరాలు..

నాన్నగారి పేరు మీద స్టార్ట్ చేసిన ట్రస్ట్ పనులు జరుగుతున్నాయి. పూర్తికాగానే ఎలా చేయాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నామనే వివరాలను తెలియజేస్తాను. ఫండింగ్ అయితే నా సినిమాల నుండి కొంత, ప్రొడక్ష నుండి కొంత వెచ్చించాలనుకుంటున్నాం.

 
VIKRAM: THE "LUCKY STAR" OF TOLLWOOD

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.