1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగస్టు మొదటి వారంలో గీతాంజలి

IndiaGlitz [Monday, June 30, 2014]
Comments
View Geethanjali Press Meet Gallery
View Geethanjali Press Meet Gallery

యం.వి.వి.సినిమా బ్యానర్ పై రూపొందుతోన్న సినిమా ‘గీతాంజలి’. అంజలి ప్రధానపాత్ర పోషిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కోనవెంకంట్ సమర్పణ. ఎం.వి.వి.సత్యనారాయణ. రాజ్ కిరణ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆడియోను జూలై రెండో వారంలో, సినిమాని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

కోనవెంకట్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాని పివిపి సంస్థవారు చేయాల్సింది. కొన్ని కారణాల కారణంగా వారు చేయలేకపోయారు. నేను కథ విన్నాను. కథ చాలా సూపర్ గా ఉంది. దాంతో  నేనే సినిమాని నిర్మించాలనుకున్నాను. యం.వి.వి.సత్యనారాయణగారు పెద్ద సినిమా చేయాలని ఎదురుచూస్తుంటే ముందు చిన్న సినిమా చేయమని ఆయనకి సలహా ఇచ్చాను. నా ప్రతి సినిమా బ్రహానందంకి స్పెషల్ కామెడి ఉంటుంది. ఈ సినిమాలో అలాగే ఉంటుంద. బ్రహ్మానందంపై స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. సినిమాకది ప్లస్ పాయింట్ అవుతుంది. అంజలి చక్కగా నటించింది. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్,  మంచి నటనను కనపరిచారు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కోనవెంకట్, హర్షవర్ధన్ రాణే, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, నిర్మాత సత్యనారాయణ , ప్రవీణ్ లక్కరాజు, సాయి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Sri Krishnadevaraya awards for Mohan Babu & Sharada

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.