1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వాళ్లకీ మళ్లీ ఛాన్స్

IndiaGlitz [Monday, June 30, 2014]
Comments

సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్స్ కి ప్రత్యేకస్థానం ఉన్నా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కి లైఫ్ టైమ్ తక్కువ. ఈ విషయాన్ని నొక్కి వక్కాణించనక్కర్లేదు. ఎందుకంటే ఒక స్టార్ పక్కన హీరోయిన్ గా నటించిన హీరోయిన్ కొన్ని సంవత్సరాలు తర్వాత ఆటోమేటిగ్గా ఫేడవుట్ అవుతుంది. పెళ్లయినా, కాకపోయినా కొన్నేళ్లు సినిమాల్లేక తటపటాయిస్తే హీరోయిన్ కెరీర్ ను కోల్పోయినట్టే. ఒకవేళ కనిపించినా ఎక్కడో ఓ ఐటమ్ సాంగ్ లోనో, అతిథి పాత్రలతోనే సరిపెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు వద్దనుకున్న వారిని వెతుక్కుంటూ వెళ్లడం కనిపిస్తోంది. హీరోయిన్లకు పనికిరారనుకున్నవారు ఇప్పుడు పనికొస్తున్నారు. ఒకప్పుడు వద్దనుకుని పక్కన పెట్టేసిన పరిశ్రమే వాళ్లని వెతుక్కుంటూ అవకాశాలు కల్పిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా  హీరోయిన్ గానే అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారి సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఓ లుక్కేద్దాం...

శ్రియ

 దక్షిణాదిన టాప్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ ఢిల్లీ డాల్ ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిందేసిన ఈ చిన్నది, ఒకానొక దశలో సినిమాలు లేక ఫేడవుట్ అయిపోయింది. అడపా దడపా ఐటెం సాంగ్స్, చిన్న రోల్స్ లో కనువిందు చేసినా, స్టార్ హీరోల సరసన అవకాశాలు సన్నగిల్లాయి. కానీ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ తెరపై మళ్లీ ‘మనం’ సినిమాతో మెరుపులా మెరిసింది.  ఈ సినిమా సక్సెస్ సాధించడంతో విక్టరీ వెంకటేష్, పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ లో వెంకీ సరసన అవకాశం దక్కించుకుంది. మరి ఈ ఇన్నింగ్స్ లో ఎంతకాలం హవా చాటుతుందో వేచి చూడాల్సిందే..

మీనా

సొగసరి కళ్ల మీనా సైతం టాలీవుడ్ లోని టాప్ హీరోల సరసన ఆడిపాడింది. అవకాశాలు సన్నగిల్లడంతో పెళ్లి చేసుకుని బుల్లితెరపై ప్రత్యక్షమైంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు మలయాళంలో మోహన్ లాల్ తో నటించిన ‘దృశ్యం’ సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాని వెంకీ హీరోగా ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని ఆదిలో చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడ్డారు. అయితే చివరికి మీనాకే ఓటు వేశారు. దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. మలయాళం దృశ్యంలో  మంచి ఫెర్పామెన్స్ అందులో ఒకటి. రెండవది వెంకటేష్ తో గతంలో మీనా నటించిన చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు, సుందరకాండ సినిమాలు ఘనవిజయం సాధించడం. ఇదంతా ఒక ఎత్తైతే సీనియర్ హీరో వెంకటేష్ ఈ సినిమాలో ఇద్దరి పిల్లల తండ్రిగా నటిస్తున్నాడు. అలాంటప్పుడు వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ అయితేనే సూటవడం కూడా మరో పాయింట్.

త్రిష

దశాబ్దకాలంగా తెలుగు చిత్రసీమలో ఆగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చెన్నైచంద్రం వరుస సినిమాలతో హోరెత్తించింది. తర్వాత అవకాశాలు సన్నగిల్లినా అప్పుడప్పుడు తెరపై తళుక్కుమంటూనే ఉంది. అయితే 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన ‘దమ్ము’ తర్వాత మళ్లీ మన తెలుగు తెరపై కనపడలేదు. త్రిష టైమ్ అయిపోయిందని చాలా విమర్శలు వినిపించాయి. అయితే బాణంలా దూసుకొచ్చి నందమూరి బాలకృష్ణ, సత్యదేవ కలయికలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని విమర్శకులు నోళ్లు మూయించింది.

స్నేహ

బాపు బొమ్మలాంటి హీరోయిన్ స్నేహ ఆరంభంలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో మంచి ఫెర్ఫామెన్స్ ఉన్న రోల్స్ తో దక్షిణాది ప్రేక్షకుల మదిని దోచుకుంది. అవకాశాలు తగ్గిపోగానే అడపా దడపా సినిమాల్లో కనువిందు చేసింది. తెలుగులో నాగార్జునతో నటించిన ‘రాజన్న’ సినిమా తర్వాత సినీ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనుకుంటున్న సమయంలో ‘ఉలవచారు బిర్యాని’లో ప్రకాష్ రాజ్ సరసన ఏకంగా మూడు భాషల్లో నటించింది. సినిమాల్లో నటించడం మానలేదని తనకి నచ్చిన పాత్రలతో నిర్మాతలు సంప్రదిస్తే ఆలోచిస్తానంటోందిప్పుడు..

వీరే కాకుండా వెళ్లవయ్యా వెళ్లు అంటూ సందడి చేసిన సదా ఇప్పుడు ‘యమలీల’ సీక్వెల్ ‘యమలీల2’లో ఓ సాంగ్ లో నర్తిస్తుంది. అలాగే ఇంద్రజ కూడా అజయ్ సరసన ఓ సినిమాలో నటిస్తుందని సమాచారం. రమ్యకృష్ణ, రాశి ఇలా సీనియర్ హీరోయిన్స్ ఎవరికి వారు వారి స్టైల్లో రీఎంట్రీ ఇస్తున్నారు. అందరికి ఈ రీ ఎంట్రీలు ఎంత మేర హెల్ప్ అవుతాయో మనమైతే చెప్పలేం.

కొత్తందాలు ఇన్ని ఉండగా పాత నీరుకు ఉన్న పళాన ఇంత గిరాకి ఎందుకొచ్చింది? అనే అనుమానం రావడం పరిపాటే. ఇందుకు కారణాలను ప్రత్యేకంగా వెతుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ఆగ్రహీరోల సరసన వారి వయసుకు తగిన జోడిగా కనపడాలన్నా, వారి నటనతో పోడిపడి నటించాలన్నా కొత్త హీరోయిన్స్ చాలా వరకు సరితూగడం లేదు. అందుకనే మన నిర్మాతలు వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఒక్క సినిమాలో అవకాశం వచ్చినంత మాత్రాన భవిష్యత్తు బంగారంగా ఉందని చెప్పలేం. దక్కిన అవకాశం విజయం సాధించాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో అదృష్టం బావుందోయ్.. అనిపించుకోగలగాలి. అప్పుడే కొనసాగగలరు. లేకుంటే దారి ఆగమ్యగోచరమే. ఏదేమైనా ఆల్ ది బెస్ట్... పర్ దెయిర్  లాంగ్  కెరీర్...




అందుకే ఆలస్యమవుతోందట



Other News


సారీ చెప్పిన దర్శకుడు

ఆగస్టు మొదటి వారంలో గీతాంజలి

Sri Krishnadevaraya awards for Mohan Babu & Sharada



Shriya Saran Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Micromax SIIMA 2015 in Dubai
 'Gopala Gopala' completes 50 days
 Shriya to raise funds for 100 heart surgeries
 'Gopala Gopala' audio creating sensation
 'Gopala Gopala' Rocking in USA
 Case filed against 'Gopala Gopala'
 Write your review on 'Gopala Gopala'
 Indiaglitz 'Gopala Gopala' contest final winners list
 Gopala Gopala USA Premiers Confirmed
 'Gopala Gopala' The Remake of 'Oh My God' Releases Worldwide Tomorrow

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.