1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్టార్స్ తో సినిమా తీయను: తేజ

IndiaGlitz [Wednesday, April 11, 2012]
Comments

నేను స్టార్స్ కోసం ఎదురుచూడను. కొత్తవాళ్లతో సినిమా చేయడమే నాకు సుఖం. స్టార్స్ ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్ లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్ ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్ తో చెయ్యకూడదనే అనుకుంటున్నా అని చెప్పారు డైరెక్టర్ తేజ.

'కేక' తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకున్న ఆయన ఏప్రిల్ 13న 'నీకు నాకు డాష్ డాష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంతకాలం గ్యాప్ తో వస్తున్నందుకు జనంలో ఈ సినిమా పట్ల ఆసక్తి ఉందో, లేదో తనకు తెలీదనీ, కానీ తనకు మాత్రం ఈ సినిమాని వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే క్యూరియాసిటీ, టెన్షన్ ఉన్నాయనీ ఆయనన్నారు.

ఈ సినిమా ఫలితం నేను అప్ టు డేట్ ఉన్నానా, లేదా అనే సంగతి చెబుతుంది" అని చెప్పారు తేజ. వెంకటేశ్ తో 'సావిత్రి' సినిమా పెండింగులో ఉంది కదా అనడిగితే ఈ శుక్రవారం సినిమా ఫలితం ఆ సినిమా ఉంటుందా, లేదా అనేదాన్ని డిసైడ్ చేస్తుందన్నారు. 'నీకు నాకు డాష్ డాష్'కి సెన్సార్ వాళ్లు 19 కట్స్ చెప్పి 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. "సెన్సార్ వాళ్లు ఇచ్చిన కట్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. అవి అందరు ప్రేక్షకులకి కరెక్ట్ కాదని వాటికి కట్స్ చెప్పారు. ప్రేక్షకులు వాటిని రిజెక్ట్ చేసేకంటే సెన్సార్ వాళ్లు వాటిని కట్ చేయడమే మంచిది. అవి చేశాక సినిమా ఇంకా బెటర్ అనిపించింది" అని తనదైన స్టయిల్లో చెప్పారు తేజ.
Angelina Jolies Maleficent Puts a Spell on 2014

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Racha clocks Rs. 23.01 cr in 5 days
 Pawan croons for Gabbar Singh
 Vishnu pins hopes on 'Dorakadu'
 Allu Arjun's 'Julayi' Overseas by Ficus
 Srikanths films languishing in studios
 Jayasudha finds our directors inept
 Prakash Raj to produce Allu Sirish debut
 Tejas NNDD to release on April 13
 Abhishek prays at Kadapa dargah
 ANR felicitated by CM
 Sony and MAA TV intend to strike strategic alliance
 Vikrams Thaandavam to be shot extensively in UK
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.