1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

బ్యాంకాక్ లో మిస్టర్ 7

IndiaGlitz [Wednesday, April 11, 2012]
Comments

స్వర్గీయ ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ హీరోగా తెరకెక్కుతున్న  'మిస్టర్ 7' (వీడు ఎవరికీ దొరకడు) సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది.  ఈ సినిమా పాటల్నిఈనెల 6నుంచి 17 వరకూ బ్యాంకాక్ లో అందమైన లోకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఎస్వీ రంగారావు జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు ఎస్వీఆర్ సినీ కార్ప్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్వీఎల్ ఎస్ రంగారావు మాట్లాడుతూ..జనవరి 30న ప్రారంభించిన మా సినిమా షూటింగ్ ఏప్రిల్ నాలుగో తేదీతో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడు పాటల చిత్రీకరణ జరుగుతోంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. డ్యూయెట్స్ రెండు, ఐటమ్ గర్ల రచనా మౌర్యపై ఓ పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తాం. అజయ్ సాయి నృత్య దర్శకత్వంలో మూడు పాటల్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెలాఖరున ఆడియో విడుదల చేసి మేలో వేసవి స్పెషల్ గా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నా'మన్నారు.

దర్శకుడు చరణ్ రెడ్డి మాట్లాడుతూ మా హీరో ఎస్వీఆర్ తాతకు తగ్గ మనవడిగా అద్భుతమైన నటనను కనబరుస్తున్నాడు. డాన్స్ల్ ల్లో, ఫైట్స్ ల్లో చాలా ఈజ్ కనిపిస్తోంది. కథ మొత్తం 7 సంఖ్య చుట్టూ తిరుగుతుంది. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ లతో ఈ సినిమా ఉంటుంది. హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయ కూడా చక్కగా నటించింద'న్నాడు. ఎస్వీఆర్, నీలం ఉపాధ్యాయ, శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ఏవీఎస్, గుండు హనుమంతరావు, శ్రావణ్, పృధ్వి, సత్యం, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే మాటలు ప్రదీప్ సీహెచ్. సంగీతం: మున్నా.
The Hunger Games Once Again Lands on Challenged Books List

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sudhir Babu to get into action mode
 Mahesh-Sukumar film to star from April 22
 Jiiva confirms his presence in Vikram's 'David'
 Thaman to music-direct Nag's next
 Ee Rojullo Shree signs a new film
 Amala Paul Allu Sirish in a bilingual?
 Savithri with Venky will depend on NNDD success: Teja
 SVR Jrs Mr 7 filming songs in Bangkok
 Marina and its message
 Racha clocks Rs 2301 cr in 5 days
 Pawan croons for Gabbar Singh
 Vishnu pins hopes on Dorakadu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.