Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada


రామ్ కొత్త చిత్రం ప్రారంభం

IndiaGlitz [Friday, April 13, 2012]
Comments

'కందిరీగ' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బెల్లంకొండ సురేశ్ మరో సినిమాను ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్ లో గత యేడాది వచ్చిన 'కందిరీగ' ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆ చిత్ర దర్శకుడు సంతోష్ శీనివాస్ తోనే ఈ సినిమానూ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.మల్టిడైమన్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రెజెంటేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. 'కందిరీగ'కు సంగీతం అందించిన థమన్ ఈ చిత్రానికీ వర్క్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. గురువారం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది.

'కందిరీగ' సినిమా చూసిన వాళ్ళందరూ అనకాపల్లి శ్రీనుగాడు పాత్రలో రామ్ ను తప్పితే మరొకరి ఊహించుకోలేరు. అదే తరహా క్యారెక్టరైజేషన్ తో 'కందిరీగ'కు సీక్వెల్ గా సంతోష్  శ్రీనివాస్ ఈ కథను తయారు చేశాడని  ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కందిరీగకు సీక్వెల్ అని దర్శక నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. దాదాపు అదే యూనిట్ ఈ కొత్త సినిమాకూ పని చేస్తుండటం విశేషం. మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. మరి ఈ కొత్త సినిమా 'కందిరీగ'ను మించి ఏ స్థాయిలో హిట్ అవుతుందో వేచి చూడాలి.



 డాక్టర్ గా వస్తున్న కృష్ణుడు



Other NEws

డాక్టర్ గా వస్తున్న కృష్ణుడు

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Yevadu' audio at this month end
 This will be Mass Maharaj's season : Harish Shankar
 'Kanchana' to Bollywood
 Srihari's 'Siva Kesav' audio launch
 Pawan Kalyan's wife Renu Desai to produce a movie
 What the hell, India ? (A user's response on Jiah's suicide)
 Thaman completes half-century
 Sushanth's 'Adda' shooting wrapped up
 'Rahaasya Police' completes dubbing work
 I'll not make horror & mafia films anymore : RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.