|
మాస్ మహరాజా రవితేజ దరువు వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. రవితేజ సినిమాల టైటిల్స్ అతని క్యారెక్టర్‌ను చెప్పకనే చెబుతుంటాయి. తాజాగా తెరకెక్కుతున్న 'దరువు' కూడా అలాంటి సినిమానే. కొద్దికాలం గ్యాప్ తర్వాత సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీ హీరోయిన్‌గా నటిస్తున్న 'దరువు' చిత్రం టీజర్ విడుదలైంది.
'దరువు' చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. తమిళ, కన్నడ భాషల్లో పలు సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన విజయ్ అంటోని తెలుగులో 'మహాత్మ' చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెల 18న 'దరువు' సినిమా ఆడియోను విడుదల కాబోతుంది. రవితేజ బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'దరువు' మూవీని మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
|