|
ఇప్పటివరకు తన అందచందాలు, వొంపుసొంపుల ప్రదర్శనతో ఆకట్టుకున్న భారీ అందాల నమిత ఇక నుంచీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకోనుంది. ఇప్పటిదాకా సెక్స్ బాంబ్‌గా కుర్రకారును వెర్రెత్తించిన ఆమె ఎందుకో ఇప్పుడు యాక్షన్ సీన్లపై కన్నేసింది. ఇప్పట్లో సినిమాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు.
సినిమా ఇండస్ట్రీని ఎంతగానో ప్రేమిస్తున్నా. నాకు బాగా గుర్తింపుతెచ్చిన రంగం ఇదే. తమిళంలో ఆఫర్లు బాగా వస్తున్నాయి. వీటిలో మీకు కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తా. నా అభిమానుల్ని అలరించడానికి కొత్త అవతారం ఎత్తబోతున్నా. ఇదివరకటిలా హాట్ హాట్ సీన్లలో కాకుండా యాక్షన్, ఎడ్వంచరస్ స్టంట్స్ చేయబోతున్నా. ఇవి అభిమానులకి తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నా" అని చెప్పింది నమిత.
అలాగే ఆమె ఈ మధ్యే ముంబైలో ఓ భవన నిర్మాణ సంస్థను ప్రారంభించిందంట. భవన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందనీ, ఈ రంగంలోనూ రాణించడానికి కృషి చేస్తాననీ చెప్పింది ఈ బొద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు, మరోవైపు కన్స్ట్రక్షన్ బిజినెస్‌తో నమిత పని బాగానే ఉందని సినీ జనం అంటున్నారు.
|