Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada


బోయపాటి డైరెక్షన్ లో ప్రిన్స్

IndiaGlitz [Thursday, April 19, 2012]
Comments

వరుస విజయాలతో సాగిపోతున్న ఇద్దరు కలిస్తే ఘనవిజయం ఖాయమంటారు. ప్రిన్స్ మహేష్ బాబు, డైనమిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ వార్త మహేష్ బాబు అభిమానులకు మరింత ఉత్సాహం కలిగిస్తోంది. సక్సెస్ రూటులో సాగుతున్న ఆ ఇద్దరూ కలిస్తే ఘనవిజయం ఖాయమని  అభిమానులు ఆశిస్తున్నారు. ట్రేడ్‌ వర్గాలు సైతం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరో హీరోగా కనిపించనున్నారు.ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్‌ దర్శకత్వంలో ప్రిన్స్ ఓ సినిమా అంగీకరించారు. అయితే ఈ చిత్రం కంటే ముందుగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా బూరుగుపల్లి శివరామకృష్ణ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

కాగా ఎన్టీఆర్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము' నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ చిత్రం విడుదల కాగానే బోయపాటి శ్రీను తాను మహేష్ తో రూపొందించే పనిమీదే ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రిన్స్ కు బోయపాటి శ్రీను స్టోరీ లైన్‌ వినిపించారని, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనీ సినీవర్గాల భోగట్టా. మరి బోయపాటి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.



 'గోలగోల 'గా ఆడియో విడుదల



Other NEws

'గోలగోల 'గా ఆడియో విడుదల

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Kanchana' to Bollywood
 Pawan Kalyan's wife Renu Desai to produce a movie
 Sushanth's 'Adda' shooting wrapped up
 'Ramayya Vastavayya' goes to Pollachi
 Mahesh Babu & Tamannah love story getting scripted
 Balupu in Overseas by BlueSky
 Write your own review on 'Something Something'
 Sirisha, Sridhar announce a slew of films
 A special day for Cherry
 Chai to team up with Hansika, Tamanna?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.