1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నూతన హీరోతో శ్రద్ధాదాస్

IndiaGlitz [Wednesday, April 25, 2012]
Comments

వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు.  పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు తనయుడు శివ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో శ్రీహరి హీరోగా 'భద్రాద్రి' చిత్రం నిర్మించిన మల్కాపురం శివకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వర్మ శిష్యుడు వెంకన్నబాబు యేపుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలైంది. దాసరి క్లాప్‌ నివ్వగా, హీరో కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో శివకు జోడీగా శ్రద్ధాదాస్‌, నిధి నటించబోతున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని శివ తెలిపాడు. మే 2 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరో మూడు మాసాల్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ నేను జయంత్, వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఈ చిత్రంలో హీరో పాత్ర చిత్రణ పూర్తి వైవిధ్యంగా వుంటుంది. సస్పెన్స్‌తో పాటు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం అన్నారు. అభినయానికి ప్రాధాన్యతవున్న పాత్రను చేస్తున్నానని కథానాయిక శ్రద్ధాదాస్ తెలిపింది. ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్న తన కుమారుడికి అందరి ఆశీస్సులు కావాలని శాఖమూరి మల్లిఖార్జునరావు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయరామ్, కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.
History of The Avengers and its evolution

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dhalam - First Look
 Sunny Leone continues her onward march
 Watch 'Life Ki Toh Lag Gayi' On IndiaGlitz Movies!
 Rebel's big ticket fight has 30 Russians
 Zee Telugus next big offering: Punar Vivaham
 Sri shooting for Aravind2 in Goa
 Ranas film with Selvaraghavan finalized
 Jackie Shroff: Rajinikanths villain in Kochadaiyaan!
 Shaam goes nude for Ace Raja Rani & Joker!
 Happy Birthday Boyapati
 Nayan has emerged stronger
 Tamanna not ready to take Bolly flight
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.