|
దర్శకుడు గౌతమ్ మీనన్ తో తనకెలాంటి వైరంగాని, విభేదాలు గాని లేవని యువ హీరో రామ్ స్పష్టం చేశాడు. 'ఏన్ ఎండ్రాల్ కాదల్' ఎంబేన్ చిత్రం ద్వారా ఈ యువ హీరో కోలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రామ్ సరసన తమన్న హీరోయిన్ గా నటించింది.
నిజానికి ఈ క్రేజీ హీరో ఇంతకు ముందే తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాల్సి ఉంది. దర్శకుడు శంకర్ నిర్మించిన కాదల్ చిత్రంలో రామ్ నటించాల్సింది. ఎర్రగా, పట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా కనిపించిన రామ్ ను కాదల్ చిత్రం హీరో పాత్రలో నటింపజేయడానికి దర్శకుడు బాలాజీ శక్తివేల్ కు మనస్సు అంగీకరించలేదట. ఈ విషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించారు కూడా.
ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న నీదానే ఎన్ పొన్ వసంతం చిత్రం తొలుత హీరోగా రామ్ ఎంపికయ్యాడు. అయితే ఆ చిత్రం నుంచి రామ్ నుంచి వైదొలిగాడు. ఈ చిత్రాన్ని చేయకపోవడానికి రామ్ వివరణ ఇస్తూ 'నీదానే ఎన్ పొన్ వసంతం' చిత్రాన్ని మొదట ఒక భాషలోనే రూపొందించాలనుకున్నామన్నారు.
ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించడం, మూడు భాషల్లోనూ ఒకేసారి నిర్మించడం వల్ల తనకు కాల్ షీట్స్ సమస్య ఏర్పడిందన్నాడు.అంతేకాని దర్శకుడు గౌతమ్ మీనన్ తో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఇటీవల కూడా ఆయన తన సొంత బ్యానర్ లో మరో అవకాశం ఇచ్చారని రామ్ తెలిపాడు.
|