|
చాలాకాలంగా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ ప్రియమణి తాజాగా తన బరువును ఆరు కిలోల తగ్గించుకుంది. దాంతో ఈ మలయాళ కుట్టి ఐదు నుంచి ఆరు కిలోల బరువు తగ్గి మరింత సెక్సీగా తయారయిందట. దీని గురించి ప్రియమణి మాట్లాడుతూ తాను నాలుగైదేళ్ల క్రితం ఎంత స్లిమ్‌గా ఉండేదాన్నో మళ్లీ ఇప్పుడు అలా తయారయ్యానని తెలిపింది. ఈ అమ్మడు త్వరలో రితీష్ దేశ్‌ముఖ్‌తో ఒక హిందీ చిత్రంలో జతకట్టనుంది.
ఓ కన్నడ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు స్లిమ్‌గా తయారయ్యానని ప్రియమణి చెబుతోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా తెరకెక్కిన 'ద్రోణ' చిత్రంలో స్విమ్మింగ్ సూట్‌లో అందాలను ఆరబోసింది. దీనిపై చెబుతూ ఆ చిత్రంలోని పాత్ర కోసం అలా నటించడం తప్పనిసరి అయ్యిందని తెలిపింది. హాలీవుడ్ చిత్రంలో కూడా అంత సెక్సీగా నటించి ఉండేదాన్ని కాదేమో అని చెప్పుకొచ్చింది ప్రియమణి. తెలుగులో అవకాశాల కోసం ఈ అమ్మడు ఎదురు చూపులు చూస్తోంది. మరి తగ్గిన బరువు ప్రియమణికి ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.
|