1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నరేష్ సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్

IndiaGlitz [Thursday, April 26, 2012]
Comments

అల్లరి నరేష్ హీరోగా చంటి అడ్డాల నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ మొదలైంది. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కోటి స్వరరచన చేస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ సినిమా ప్రారంభోత్సవానికి దాసరి, డి. రామానాయుడు, బి.గోపాల్‌ తదితరులు హాజరయ్యారు.

యమపురి నేపథ్యంలో నరేష్ చేయబోతున్న కొత్త సినిమా షూటింగ్‌  ఫిల్మ్‌సిటీలో మొదలైంది. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఫ్రెండ్స్‌ మూవీస్‌ పతాకంపై అడ్డాల చంటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా రిచా పనమ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

అడ్డాల చంటి నిర్మించిన 'తిరుమల తిరుపతి వెంకటేశ' చిత్రానికి సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఈ బ్యానర్‌లో ఆయనకు ఇది రెండో సినిమా. అలానే నరేష్ హీరోగా నటించిన 'నేను', 'బెట్టింగ్‌ బంగార్రాజు' సినిమాలకూ సత్తిబాబు దర్శకత్వం వహించారు. నరేష్‌, సత్తిబాబులకు ఇది హ్యాట్రిక్‌ చిత్రం. కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో 'అల్లుడా మజాకా' సినిమాలోని 'అత్తో అత్తమ్మ కూతురో...' పాటను రీ-మిక్స్‌ చేయబోతున్నారు. ఇవీవీ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు కూడా కోటినే సంగీతం అందించారు. యముడు నేపథ్యంలో వచ్చిన సినిమాల మాదిరే ఇదీ ఘన విజయం సాధిస్తుందనే ఆకాంక్షను సత్తిబాబు వ్యక్తం చేశారు.
Dammu carries forward fight against piracy

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dammu carries forward fight against piracy
 Richa rejects eight stories
 'Yamudu 2' to roll after 'Maatraan'
 Dammu - Singapore Schedules
 Dhalam First Look
 Sunny Leone continues her onward march
 Watch Life Ki Toh Lag Gayi On IndiaGlitz Movies!
 Rebels big ticket fight has 30 Russians
 Zee Telugus next big offering: Punar Vivaham
 Sri shooting for Aravind2 in Goa
 Ranas film with Selvaraghavan finalized
 Jackie Shroff: Rajinikanths villain in Kochadaiyaan!
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.