|
సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగం' సినిమా సూపర్ హిట్టయింది. తెలుగులోనూ దాని డబ్బింగ్ వెర్షన్ 'యముడు' లాభాలు గడించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని సూర్య, దర్శకుడు హరి సంకల్పించారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు - 'ఆరు', 'వేల్', 'సింగం' సక్సెసయ్యాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న 'సింగం 2'లో మెయిన్ హీరోయిన్ రోల్‌ను అనుష్కే దక్కించుకుంది. గ్లామర్ కురిపించాల్సిన సెకండ్ హీరోయిన్ కేరక్టర్‌కు బొద్దు భామ హన్సిక ఎంపికైంది.
కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం నటిస్తున్న 'మేట్రాన్' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమా కోసం అనుష్క కేవలం 25 కాల్షీట్స్ ఇచ్చింది. తొలి భాగంలో నటించిన వివేక్, విజయ్ కుమార్, నాజర్, రాధారవి ఇందులోనూ నటించనున్నారు. మరో రెండు కీలక పాత్రలకు రెహమాన్, సంతానం ఎంపికయ్యారు. తొలి సినిమాలో విలన్‌గా నటించిన ప్రకాశ్ రాజ్ మాత్రం ఇందులో నటించడం లేదు. ముఖేశ్ రుషి ఆ స్థానంలోకి వచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
|