Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రీ ఎంట్రీ ఇస్తున్న రీమాసేన్

IndiaGlitz [Friday, April 27, 2012]
Comments

అందాల తార రీమాసేన్ వివాహం అనంతరం ఓ తమిళ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రీమాసేన్ పోలీస్ అధికారిణి పాత్ర పోషించనుంది.  విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖరన్ తొలి రోజుల్లో తెరకెక్కించిన చిత్రం 'చట్టం ఒరు ఇరుట్టరై'. ఈ చిత్రాన్ని నటుడు విజయ్ మళ్లీ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో  ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు ఈ హీరోగా నటిస్తుండగా, రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా నటిస్తోంది.

విక్రమ్ ప్రభు సోదరిగా పోలీసు అధికారిణి పాత్రలో రీమాసేన్ నటిస్తారు. వివాహానంతరం ఆమె కోలీవుడ్‌లో నటించనున్న చిత్రం ఇదే. ఈ పాత్ర కోసం రీమాసేన్ యోగా, శరీర వ్యాయామం చేస్తూ పోలీసు అధికారిణి పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదట.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం హిందీ వెర్షన్ అంధాకానూన్ చిత్రాన్ని చూశానని  అందులో పోలీసు అధికారిణి పాత్రను నటి  హేమమాలిని చేశారని చెప్పింది. ఈ తరహా చాలెంజింగ్ పాత్రలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఆమె పేర్కొంది.   ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని రీమాసేన్ వెల్లడించింది.




ఆయన కోరిక మేరకే నటిస్తున్నా.



Other News

ఆయన కోరిక మేరకే నటిస్తున్నా

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.