Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నవదీప్ కు ఇంకో సినిమా వచ్చింది

IndiaGlitz [Monday, April 30, 2012]
Comments

దిల్ రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్'లో సెకండ్ హీరోగా కనిపించిన నవదీప్ చాలా రోజుల తర్వాత ఓ సినిమాలో సోలో హీరోగా నటిస్తున్నాడు. 2011లో అతను నటించిన మూడు సినిమాల్లోనూ అతనితో పాటు ఒకరో ఇద్దరో హీరోలుగా నటించారు. రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు'లో టైటిల్ కి తగ్గట్లే ముగ్గురు హీరోలు- నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ నటించారు. 'ఆకాశమే హద్దు'లో సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ మరో హీరోగా కనిపించాడు.

ఇక 'ఓ మై ఫ్రెండ్'లో అసలు హీరో సిద్ధార్థ్ కాగా, నవదీప్ ది కొసరు హీరో కేరక్టరే. అతను చివరిసారి సోలో హీరోగా కనిపించిన సినిమా 'యాగం'. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతని చివరి హిట్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'చందమామ' కావడం గమనార్హం. ఇందులోనూ శివబాలాజీ మరో హీరోగా నటించాడు. సోలో హీరోగా అయితే ఇంతవరకు అతనికి ఒక్క హిట్టూ లేదు. ఈ నేపథ్యంలో అతని మీద పాలడుగు వెంకట్రావు, కె.ఎస్. వ్యాస్ అనే నిర్మాతలు నమ్మకం పెట్టుకొని ఓ సినిమా మొదలుపెట్టారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాకి సూర్య దర్శకుడు.

'ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది' అనే కాన్సెప్టుతో ఈ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నవదీప్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. మొత్తానికి ఈ సినిమాతోనైనా అతను సక్సెస్ అవుతాడో, లేక మునుపటి సినిమాల తరహాలోనే నిర్మాతలకి నష్టాలు తెస్తాడో చూడాలి.




సర్కార్ గూండాగా శ్రీహరి





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 They are rumours about Shruti Haasan
 All eyes on 'Naaigal Jaakirathai' Telugu remake
 'Naa Bangaru Thalli' Comes to the U.S.
 NTR-Puri's 'TEMPER' Firstlook Poster
 'Pataas' Logo
 'Naa Bangaru Thalli' 2nd week schedules
 Baahubali Meets 'The End'
 An exclusive dining opportunity with the Stars
 'Yamaleela 2' USA Schedules
 Aadi aiming for it
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.