1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ కొత్త హీరోయిన్ ఎటువైపు

IndiaGlitz [Friday, August 30, 2013]
Comments

స్టార్ హీరోతో సినిమా అంటేనే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అది కూడా తొలి సినిమానే అలాంటి రేంజ్ కథానాయకుడుతో అంటే  ఏ కథానాయిక మాత్రం పొంగిపోదు చెప్పండి. అలానే  పరవశిస్తోంది కొత్తమ్మాయి కృతి సనన్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 1 నేనొక్కడినే సినిమా కోసం మహేష్ సరసన కృతి హీరోయిన్గా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే అమ్మడికి కొన్ని సందేహాలు చుట్టుముడుతున్నాయట.

అందుకు కారణమేమిటోనని ఆరాతీస్తే తేలిన విషయమేమిటంటే.. మహేష్ బాబు సినిమాతో పరిచయమైన హీరోయిన్ లలో చాలామంది తెలుగులో నిలదొక్కుకోకపోవడమేనట.  సోనాలి బింద్రేని మినహాయిస్తే.. బిపాసా బసు, లీసారే, అమృతారావు, నమ్రతా శిరోద్కర్ వంటి బాలీవుడ్ భామలంతా వన్ సినిమా వండర్ లుగానో.. మహా అంటే మరొక్క సినిమాతోనే సరిపెట్టుకున్న వైనమే అమ్మడి ఆందోళనకి కారణమట. తొలి సినిమా విడుదల అయితేనే కదా.. కృతి భవితవ్యం తేలేది. ఈ లోపే సదరు ముద్దుగుమ్మ టెన్షన్ పడడం కరెక్ట్ కాదేమోనని అంటున్నారు పండితులు.

ఇంతకీ కృతి ప్రయాణం ఎటువైపు.. సోనాలిలాగా సక్సెస్ ఫుల్ గా ఉండే దిశనా.. లేదంటే బిపాసా, లీసారే, అమృతా, నమ్రతాల వన్ మూవీ వండర్ దిశగానా అనేది చూడాలి.
Love Story Of A Corrupt Cop DK Bose

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Love Story Of A Corrupt Cop 'DK Bose'
 'Nayana' Single Character Movie Audio Unveiled
 'Mithunam' Recommended For Oscar and IFFI Entries
 Japan Tastes Telugu 'Masala'
 DK Bose Gearing up for Tentative Sep14th Release
 Producers Council Recommends Aadi Shankara To Oscar Committee
 Thoofan in US with Dolby@ ATMOS
 Auto Nagar Surya Shooting To Resume From 10th September
 Sri Haris Siva Keshav In Sep Second Week
 Happy Birth Day Nag Bhai
 Bahubali Second Schedule Finished
 Amritha Rao Besides Balayya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.