Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ప్రభాస్ సినిమాలో వరలక్ష్మీ

IndiaGlitz [Saturday, August 31, 2013]
Comments

ప్రతినాయకుడు, కథానాయకుడు, గుణచిత్రనటుడు (క్యారెక్టర్ ఆర్టిస్ట్).. ఇలా పలు రకాలుగా తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకులను అలరించిన నటుడు శరత్ కుమార్. ఆయన నుంచి నటనను వారసత్వంగా తీసుకుని హీరోయిన్ గా అడుగులు వేసింది అతని తనయ వరలక్ష్మీ. సింబు నటించిన పోడా పోడీ అనే సినిమాతో రెండేళ్ల క్రితం నాయికగా తెరంగేట్రం చేసిన వర.. తన రెండో చిత్రాన్ని విశాల్ తో చేసింది.

తమిళంలో మదగజరాజా (సెప్టంబర్ 6 విడుదల)గా రూపొందిన ఆ సినిమా తెలుగులో నటరాజు తనే రాజు పేరుతో  అతి త్వరలో ఇక్కడా విడుదల కాబోతోంది.  ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి ఓ భారీ అవకాశం వరించిందని తెలిసింది. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించగా ఘన విజయం సాధించిన మిర్చి సినిమా.. కన్నడంలో సుదీప్ హీరోగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఓ హీరోయిన్ గా వరలక్ష్మీ ఎంపికయ్యిందని సమాచారం.  తొలి కన్నడ సినిమానే సుదీప్ లాంటి టాప్ హీరోతో చేయడం వరలక్ష్మీకి ఓ వరంలాంటి అవకాశమే కాబట్టి ఆమె దాన్ని ఎంతవరకు సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి. బహుశా రిచా గంగోపాధ్యాయ పాత్రలో వరలక్ష్మీ కనిపించవచ్చని వినిపిస్తోంది.




బాలీవుడ్ కి వెళుతున్న అమలా పాల్



Other NEws

బాలీవుడ్ కి వెళుతున్న అమలా పాల్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.