1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అత్తారింటికిలో ప్రణీతది ఏం లేద

IndiaGlitz [Wednesday, September 04, 2013]
Comments

'ఏం పిల్లో.. ఏం పిల్లడో', 'బావ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది బెంగుళూరు బాలిక ప్రణీత. ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలతో   కాస్తంత బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఓ తెలుగు సినిమా ఆఫర్ ని పొందింది. అది కూడా అల్లాటప్పా సినిమా కాదు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. దాంతో ఎలాగోలా తన డేట్స్ ను సర్ధుబాటు చేసుకుని మరీ.. ఆ మెగా సినిమాలో నటించేసింది.
 
కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో ఇబ్బందులు పడుతున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలాఉంటే..  ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రణీ తది  సినిమాలో పెద్దంతగా ప్రాధాన్యం లేని పాత్ర అని తెలిసింది. తన కాంబినేషన్ లో ఓ పాటకు పరిమితమయ్యే ఈ పాత్ర....తోనే పవన్ కళ్యాణ్.. సమంతని ఇంప్రెస్ చేసి తన ప్రేమలోకి లాక్కెళుతాడని వినిపిస్తోంది. సో.. ప్రణీత క్యారెక్టర్ అయితే వాలి సినిమాలోని జ్యోతిక పాత్ర తరహాలో కల్పితంలాగో.. లేదంటే సమంతని ఉడికించేందుకు సహాయ పాత్రలాగో ఉంటుందే తప్ప కథ కు చేయగలిగిందేమి లేదట.
 
ఈ గుసగుసలలో ఎంతమేరకు నిజముందో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. అందాకా.. ఇలాంటివి వినడమే తప్ప చేయగలిగిందేమి లేదు.  వీటి సంగతెలాగున్నా పవన్ సినిమాలో చిన్న పాత్ర దక్కినా అది తనకు వరం లాంటి ఆఫర్ కాబట్టి దాన్ని వినియోగించుకున్నానని హోయలుపోతోంది ప్రణీత. 



Kamina On 13th September





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Kamina' On 13th September
 Jagapathi Babu's 'Jagat Jentri'
 'Ali Baba Okkade Donga' Ali's 50th Film As Hero
 New Movie With Rajendra Prasad As Lead
 Director Sukumar To Don Producers Hat
 Mana Voori Saakshigaa With Real Time Characters
 Ramayya Vastavayya Teaser Viral Record
 Prabhu Deva unveils Prabhu Deva!
 KISS To Be Released On 13th September
 MS Raju All Praise For AMAT Team
 Tanisshq Reddy Looking For Mass Appeal
 Guna Sekhars Rudrama Devi Into Third Schedule
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.