Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

దీపికా పాటని అక్కడ వాడుకుంటాడట

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

'ప్రేమించుకుందాం..రా!', 'బావగారూ.. బాగున్నారా!', 'ప్రేమంటే ఇదేరా!..'  వరుసగా ఈ సినిమా పేర్లు వింటే ఠక్కున జ్ఞప్తికి వచ్చే రూపం దర్శకుడు జయంత్ సి.పరాన్జీది. హీరోలను మాంచి ప్రేమ కథలో చూపాలన్నా.. యాక్షన్ సినిమాతో మాస్ ని మరింత ఎట్రాక్ట్ చేయాలన్నా.. హీరోయిన్లను తెర పై అందంగా ఆవిష్కరించాలన్నా అప్పట్లో ఈ పేరు బాగా వినిపించేంది. కాలక్రమంలో తన ఫామ్ ని కోల్పోయిన ఈ ఒకనాటి అగ్రదర్శకుడు ప్రభాస్ లాంటి నేటి టాప్ హీరోని సైతం తన చేతుల మీదుగానే తెలుగు తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. 'తీన్ మార్' తరువాత మరోమారు తెలుగు సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేయని జయంత్.. ప్రస్తుతం కన్నడంలో అక్కడి టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పేరు 'నిన్నిందానే'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం తన ఆగిపోయిన లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలోని దీపికా పదుకునే పాటని వినియోగించుకోవాలని జయంత్ యోచిస్తున్నాడట.

అసలే..'చెన్నై ఎక్స్ ప్రెస్' లాంటి ఘనాతిఘన విజయంతో దీపికా హిందీలో టాప్ లో ఉంది కాబట్టి ఈ పాట సినిమాకి మరింత ఆకర్షణగా మారుతుందని జయంత్ భావిస్తున్నాడట. ఒక్కోసారంతే.. ఆగిపోయిన సినిమాలు కూడా వెరైటీగా కలిసొస్తుంతాయంతే! అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది త్వరలోనే అధికారంగా తెలుస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.




అనుష్క నయన కాజల్ ల పోటీ





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
 Will Tamannaah's wish be fulfilled this time ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.