1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కార్తీ సరసన ఛాన్స్ దక్కిందట

IndiaGlitz [Monday, September 09, 2013]
Comments

'సుందర పాండియన్', 'కుమ్కీ' (తెలుగులో గజరాజు) సినిమాలతో తమిళ కుర్రకారుని ఆకట్టుకున్న సహజ అందం లక్ష్మీ మీనన్. చేతిలో ఆరేడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సుందరి. తాజాగా మరో మంచి ఆఫర్ ని సొంతం చేసుకుందని సమాచారం.  'యుగానికి ఒక్కడు', 'ఆవారా', 'నా పేరు శివ'  వంటి తమిళ అనువాద చిత్రాల కథానాయకుడు కార్తీ హీరోగా నటించనున్న ఓ తమిళ సినిమా కోసం. అతని సరసన నటించే అవకాశాన్ని లక్ష్మీ సొంతం చేసుకుందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ప్రస్తుతం కాజల్ తో 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా', హన్సిక తో 'బిర్యాని' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కార్తీ ఆయా చిత్రాలు పూర్తయ్యాక ఈ సినిమా చిత్రీకరణ లో పాల్గొననున్నాడట. 'అట్టకత్తి' వంటి విజయవంతమైన తమిళ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. కార్తీ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చేసే ఛాన్స్ రావడం పట్ల  సంతోషాన్ని వ్యక్తపరుస్తోంది ఈ గజరాజు నాయిక. కార్తీ సినిమాలు తెలుగులోనూ అనువాదం అవుతుంటాయి కాబట్టి ఈ సినిమా కూడా డబ్ అయ్యే అవకాశం లేకపోలేదు.
Kochadaiyan Teaser Launched

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Kochadaiyan' Teaser Launched
 'Heart Attack' In Europe
 RV Ramana Murthy Passed Away
 'Kamina' Exposes Selfish Side Of Human Being
 TFI Bigwigs Praise Singeethams Welcome Obama
 Srikanths Kshatriya Finishes Shooting
 Daughter Of Varma To Arrive Soon
 Mohan Babus Suggestion To Defer South Film Industry Celebrations
 Dolby Atmos Future of Cinema Sound In Hyderabad
 Nuvvena Adi Neevenaa First Schedule Finished
 Potugadu Overseas by BlueSky
 New Film With Sri & Hari Priya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.