1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రియాకి మరోసారి దక్కేనా?

IndiaGlitz [Tuesday, September 10, 2013]
Comments

'లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్.ఆర్.ఐ మగువ ప్రియా ఆనంద్... ఆ సినిమా తరువాత 'రామరామ కృష్ణకృష్ణ', '180', 'కో అంటే కోటి'లాంటి తెలుగు చిత్రాల  కోసం నాయికగా నటించినా ఆశించిన విజయమైతే దక్కలేదు.   ఎప్పుడైతే తన అభిమాన నాయిక శ్రీదేవితో 'ఇంగ్లిష్ వింగ్లిష్'లో నటించిందో అప్పుడే అమ్మడికి ఉన్న గ్రహణం తొలిగి తొలి విజయం దక్కింది.

తమిళంలోనూ ఈ ఏడాదిలో రిలీజైన 'ఎదిర్ నీచ్చల్'తో మరో విజయాన్ని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ రానున్న 'వణక్కమ్ చెన్నై' అనే తమిళ  సినిమాపైనే. ఈ సినిమా సాధించే విజయంతో తమిళంలో మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలనన్న నమ్మకంతో ప్రియా ఉంది. 'తమిళపడమ్' (సుడిగాడు మాతృక), 'కలగలప్పు' వంటి సినిమాలతో హాస్యకథానాయకుడిగా పేరుతెచ్చుకున్న శివ ఇందులో హీరో.

కొలవరి ఢి ఫేమ్ అనిరుధ్ స్వరపరిచిన పాటలు బాగా పాపులర్ కావడంతో.. సినిమా కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని ప్రియా భావిస్తోందట.  వినోద ప్రధానంగా తెరకెక్కిన వణక్కమ్ వచ్చే నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాతో వరుసగా రెండో విజయం ప్రియాకి తమిళంలో దక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రియా చేతిలో 'వాయ్ రాజా వాయ్', 'అరిమా నంబి', 'ఇరుంబు కుదిరై' అనే తమిళ సినిమాలు ఉన్నాయి.
Vaaraahi Chalana Chitram New Productions

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Vaaraahi Chalana Chitram New Productions
 AMAT(Antaku Mundu Aa Taravaata) Dazzles the USA with Collections
 'రభస' కాదట...
 'ముని 3' బాటలో 'రభస'..
 ఎవడు కి అదో సెంటిమెంట్ అట!
 Naa Rakumarudu Ready For Audio Fest
 Minugurulu Story Of Blind Kids
 విక్రమ సింహా ముహుర్తం అప్పుడేనట
 రేసుగుర్రం లోనూ అంతేనా!
 Kochadaiyan Teaser Launched
 Heart Attack In Europe
 RV Ramana Murthy Passed Away
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.