1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రానాకి హ్యాట్రిక్ దక్కేనా?

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

ఆరడుగుల మూడంగుళాల బుల్లెట్.. యువ నటుడు రానా ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వేయికన్నులతో వేచిచూస్తున్నాడు. అయితే ఫలితం తెలుసుకోవడానికి దీపావళి వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అతనిది. అదేంటి.. ఇప్పటివరకు రానాకి తెలుగులో సరైన హిట్ దొరకని పక్షంలో కొత్తగా ఈ హ్యాట్రిక్ ముచ్చట ఏమిటి? అనుకుంటున్నారా..!

కూసింత వివరాల్లోకి వెళితే.. 'లీడర్', 'నేను నా రాక్షసి', 'నా ఇష్టం', 'కృష్ణం వందే జగద్గురుమ్'.. వంటి నాలుగు తెలుగు సినిమాల కోసం హీరోగా నటించిన దగ్గుబాటి రానా.. ఆ సినిమాలలో నటుడిగా ఓ మాదిరి మార్కులను సంపాదించుకున్నప్పటికీ విజయాన్ని మాత్రం దొరకబుచ్చుకోలేకపోయాడు.

దాంతో కేవలం హీరో వేషాలకు పరిమితమై పోవడం కంటే.. చిన్న చిన్న అతిథి వేషాలు వేసినా ఫలితముంటుంది అని భావించిన రానా వాటిపైనా దృష్టి పెట్టాడు. ఆ నిర్ణయం తీసుకున్న ముహర్త బలమేమో గాని.. రానా అతిథి పాత్రలో దర్శనమిస్తే ఆ సినిమా హిట్టే అనే ముద్ర పడిపోయింది.  ఈ ఏడాది ప్రథమార్థంలో 'యే జవానీ హై దివానీ' అనే సినిమా కోసం తొలిసారి జస్ట్ గెస్ట్ రోల్ వేసిన రానా ఆ సినిమా హిట్ లో తను సైతం ఓ భాగమయ్యాననిపించుకున్నాడు.

ఆ సినిమా రిలీజైన మరో రెండు వారాల తరువాత విడుదలైన తమిళ చిత్రం 'తీయా వేలై సెయ్యుం కుమారా' (సమ్ థింగ్.. సమ్ థింగ్..గా తెలుగులో విడుదలైంది)తోనూ మరో గెస్ట్ హిట్ ని పొందాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అజిత్ హీరోగా నటిస్తున్న 'ఆరంభం'లోనూ ఓ అతిథి పాత్ర పోషించిన రానా.. సదరు సినిమా రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.




Producer Tammareddy Krishna Murthy Passed Away



Other News


Hithudu Release in October

Puri Jagannadh to launch producer's brother as hero

'Kanche' audio release date

Meenakshi Dixit bags a biggie!

No wardrobe malfunction: Nora Fatehi

Soggade Chinni Nayana teaser: Nag enthrals in a rustic avatar

'Dictator' in Poland

Super hit duo to do magic once again

'Dynamite' attracts big demand in overseas markets

The 6th edition of the 80's Actors re union

Anirudh to make Telugu debut with Trivikram's next

Good craze for NTR-Sukumar film distribution rights





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Hithudu Release in October
 Puri Jagannadh to launch producer's brother as hero
 'Kanche' audio release date
 Meenakshi Dixit bags a biggie!
 No wardrobe malfunction: Nora Fatehi
 Soggade Chinni Nayana teaser: Nag enthrals in a rustic avatar
 'Dictator' in Poland
 Super hit duo to do magic once again
 'Dynamite' attracts big demand in overseas markets
 The 6th edition of the 80's Actors re union
 Anirudh to make Telugu debut with Trivikram's next
 Good craze for NTR-Sukumar film distribution rights
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.