1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ నుంచి సంతానంకి షిప్ట్

IndiaGlitz [Tuesday, September 17, 2013]
Comments

శేఖర్ కమ్ముల సృష్టించిన 'హ్యాపీడేస్' సినిమా ద్వారా పరిచయమైన కొత్త ముఖాల్లో గాయత్రి రావ్ ఒకరు. అందులో అప్పుగా అలరించిన ఈ అమ్మడు నటి బెంగుళూరు పద్మకి కుమార్తె. ఆ సినిమా తరువాత తనకు హ్యాపీ డేస్ వస్తాయని భావించిన గాయత్రికి ఆ స్థాయి  గుర్తింపును తెచ్చిన అవకాశాలైతే రాలేదు కానీ.. గతేడాది సంచలనం 'గబ్బర్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సైట్ కొట్టే  హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మురిపించింది.

'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ అయినప్పటికీ గాయత్రికి మళ్లీ హ్యాపీడేస్ నాటి పరిస్థితులే ఎదురవుతున్నాయనిపిస్తున్న తరుణంలో.. గబ్బర్ సింగ్ పుణ్యమా అని ఓ తమిళ సినిమాలో సంతానంకి సైట్ కొట్టే పాత్రను పొందేసింది.  కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న సుందర్ .సి తాజా చిత్రం 'మదగజరాజా' (తెలుగులో నటరాజు తనే రాజు)లో గాయత్రికి ఓ మంచి కామెడీ వేషం దక్కిందట.

ఈ సినిమాలో సంతానంతో కలిసి తాను చేసే హంగామా నవ్వులు పండిస్తుందని గాయత్రి చెబుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కావుతుంది కాబట్టి నటిగా నలుగురి దృష్టిలో పడే అవకాశముందని గాయత్రి తెగ సంబరపడుతోందట.




సత్య2 ఆడియో ఆవిష్కరణ





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'సత్య-2' ఆడియో ఆవిష్కరణ
 Rahul-Chinmayi Love Story Successful
 'DK Bose' Arriving On 27 September
 'Satya 2' Audio Launched
 Amavasya A Ghosts Revenge Story
 శూన్యంగా రాబోతున్న చైతన్య
 Producer Tammareddy Krishna Murthy Passed Away
 Bhai Finishes Shooting
 Please Dont Target Films For Protests: NV Prasad
 Potugadu Rocking in USA
 Parcel A Mookie Thriller
 Sivajis Romantic Entertainer Underway
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.