1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విక్రమ్ సినిమాలో ప్రకాష్ రాజ్

IndiaGlitz [Thursday, September 19, 2013]
Comments

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'బంగారం' సినిమాకి దర్శకత్వం వహించిన ధరణి తమిళంలో అగ్ర దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు ఇప్పుడు తనకు కలిసొచ్చిన కథానాయకుడు విక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో 'దిల్', 'ధూల్' వంటి ఘనవిజయాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు మరో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి 'రాస్కల్' అనే పేరు వినిపిస్తోంది.

కాజల్ హీరోయిన్ గా నటించే ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ప్రకాష్ రాజ్ మాత్రమే ఆ పాత్రకు సరిపోతారని.. అందుకే ఆయన్ని ధరణి ఎంచుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ తో కాజల్ తొలిసారి జోడీకట్టే సినిమా ఇదే. ఇందులో కాజల్ హాస్య ప్రధాన రోల్ లో కనిపించబోతోందట. చివరి మినిట్ లో సినిమా నుంచి తప్పుకునే అలవాటుగల కాజల్ ఈ సినిమాని మిస్ చేసుకోకుండా నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.
Manam First Look

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Manam' First Look
 Madhura Sreedhar Turns Producer With 'Ladies & Gentlemen'
 'Ee Varsham Saakshigaa' Finishes Production
 'Boy Meets Girl' Getting Ready For Release
 Attarintiki Daredi Coming On 9th October
 Ramayya Vastavayya Coming On 10th October
 Mahesh Babu To Play Gona Ganna Reddy?
 Sri Haris Police Game On 20th September
 Mahesh Babu Named As The Most Dangerous Celebrity
 Kona Venkats Story For Sridevis Next
 Glitterz Entertainment Completes Four Years
 Times Music To Release Doosukeltaa Audio
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.